మెదక్

సిద్దిపేటలో బంద్ పాక్షికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 25 : మల్లన్నసాగర్ భూ నిర్వాసితులపై పోలీసుల లాఠీచార్జీ, కాల్పులు జరిగినందుకు నిరసగా అఖిలపక్షం పిలుపు మేరకు సిద్దిపేటలో నిర్వహించిన బంద్ పాక్షిక ప్రభావం చూపింది. అఖిల పక్షం పిలుపుమేరకు పట్టణంలో కాంగ్రెస్, తెలుగుదేశం, బిజెపి, వామ పక్ష నేతలు తాడూరి శ్రీనివాస్, గూడూరి శ్రీనివాస్, ప్రభాకవర్‌వర్మ, ధరిపల్లి చంద్రం, గోవిందారం చంద్రం, కౌన్సిలర్లు దూది శ్రీకాంత్‌రెడ్డి, వెంకట్, రేవంత్, చింతల మల్లేశం పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తు దుకాణాలు బంద్ చేయించారు. అలాగే విద్యాసంస్థలు బంద్ చేయిస్తున్నారు. పాత బస్టాండ్ వద్ద దుకాణలు మూసివేస్తున్నారు. బంద్‌కు వ్యతిరేకంగా మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు అత్తరపటేల్, మచ్చవేణుగోపాల్‌రెడ్డి, వెంకట్‌గౌడ్, బర్ల మల్లికార్జున్, ప్రభాకర్, గ్యాదరి రవీందర్, బ్రహ్మం, ఆనంద్, శ్రీనివాస్‌గౌడ్‌లు ర్యాలీగా తిరుగుతూ దుకాణాలను బంద్ చేయవద్దని వ్యాపార వర్గాలను కోరారు.
అఖిలపక్షం, అధికార పార్టీ నేతల తోపులాట
అఖిల పక్షం బంద్ సందర్భంగా అఖిల పక్షం నేతల దుకాణాలు బంద్ చేయిస్తుండగా, అధికార పార్టీ నేతలు పాత బస్టాండ్ వద్ద ఎదురుఎదురు పడ్డారు. బంద్ పాటించాలని అఖిల పక్షం, బంద్ వద్దని అధికార పక్షం నేతల మధ్య పరస్పర విమర్శలు చేసుకున్నారు. ఇరువర్గాల నేతలు బంద్ విషయంలో తోపులాడుకోవటంతో స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వచ్చి ఇరువర్గాలను శాంతింప చేశారు. ఆనంతరం వన్‌టౌన్ పోలీసులు వచ్చి అఖిపక్షం నేతలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్ తరలించారు. ఆనంతరం అధికార పార్టీ పక్ష నేతలు పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తు దుకాణాలు బంద్ చేయకుండా చూడటంతో పట్టణంలో బంద్ ప్రభావం పెద్దగా కన్పించలేదు. పట్టణంలోని విద్యాసంస్థలు, ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడిచాయి. అఖిల పక్షం నేతలను ఉదయం 10గంటల లోపు అరెస్టు చేయటం వల్ల బంద్ ప్రభావం పెద్దగా కన్పించలేదు. ఈకార్యక్రమంలో అఖిల పక్షం నేతలు, ఎన్‌ఎస్‌యుఐ, ఎబివిపి విద్యార్థి సంఘాల నేతలు తాడూరి సాయిఈశ్వర్‌గౌడ్, అంజీ, సాయి తదితరులు పాల్గొన్నారు.