మెదక్

నిర్వాసితులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జూలై 25: మల్లన్నసాగర్ భూనిర్వాసితులపై పోలీసులు లాఠీచార్జి, కాల్పులు జరపడం సిగ్గుచేటని, వెంటనే అధికారులపై చర్యలు తీసుకోవాలని టిపిసిసి ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపి పొన్నంప్రభాకర్ డిమాండ్ చేశారు. గతంలో రైతులపై కాల్పులు జరిపిన చంద్రబాబుకు పట్టిన గతే కెసిఆర్‌కు పడుతుందన్నారు. సోమవారం మెదక్ జిల్లా సిద్దిపేటలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. భూనిర్వాసితులను ప్రతిపక్షాలే రెచ్చగొడుతున్నాయని, పోలీసు చర్యలను మంత్రి హరీష్‌రావు సమర్థించడం శోచనీయమని, రైతులపై పోలీసుల దాష్టికానికి నిరసనగా మంత్రి హరీష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రకారమే మల్లన్నసాగర్ భూసేకరణ చేయాలన్నారు. తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దుచేసిన తెలంగాణ సర్కార్ మల్లన్నసాగర్‌ను 50టిఎంసిలకు పెంచడం ఎంతవరకు సమంజసమన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం సందర్భంగా మల్లన్నసాగర్‌ను 50టిఎంసిలకు పెంచాలని ఏనాడూ నోరు మెదపలేదన్నారు. 2004లో మంత్రిగా హరీష్‌రావు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏనాడూ అసెంబ్లీలో మల్లన్నసాగర్ పై అభిప్రాయాన్ని ఎందుకు ప్రస్తావించలేదన్నారు. ఐటి చదివిన హరీష్‌రావు, ఎంఎ తెలుగు చదివిన కెసిఆర్‌లు సాంకేతిక నిపుణులు రూపొందించిన ప్రాజెక్టులకు రీడిజైనింగ్ చేయడంలోని సాంకేతికత ఏమిటని ప్రశ్నించారు. మల్లన్నసాగర్‌ను 1.5నుంచి 50టిఎంసిలకు పెంచడం అనాలోచిత చర్యగా అభివర్ణించారు. డిపిఆర్ లేకుండానే ప్రాజెక్టు భూసేకరణ ఏలా చేస్తారన్నారు. రైతుల పై లాఠీచార్జికి నిరసనగా అఖిలపక్షం బంద్ చేస్తే టిఆర్‌ఎస్ నేతలు బంద్‌ను అడ్డుకోవడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ హయాంలో మేమిలాగే ప్రవర్తిస్తే మీరు ఒక్కరోజైనా ఉంటారా అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్ తప్ప ఏ హామీ నెరవేర్చలేదన్నారు. ప్రభుత్వం హామీనిచ్చినా రుణమాఫీ సైతం ఇంతవరకు చేయలేకపోయిందన్నారు. రైతులు, మహిళలపై పోలీసులు చేసిన లాఠీచార్జిని యువరాజు కెటిఆర్ బర్త్‌డే కానుక ఇచ్చారన్నారు. ప్రజల నుంచి అంగీకారంతో భూసేకరణ చేయాలని, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్ చేస్తు భూసేకరణ చేయడం సరికాదన్నారు. స్వచ్ఛందంగా భూములు ఇస్తే రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నావరెవరని ప్రశ్నించారు. 2013చట్టం ప్రకారం న్యాయం చేసి భూసేకరణ చేయాలన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకం సందర్భంగా సిఎం రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, డబుల్‌బెడ్ రూంతో పాటు ప్రాజెక్టు పరిధిలోనే భూమి ఇస్తామని హామీనిచ్చారన్నారు. సిఎం హామీనిచ్చిన క్లిప్పింగ్‌లను విలేఖరులకు చూపించారు.
నేడు మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లో పర్యటించనున్న కాంగ్రెస్ నేతలు
ఈనెల 26న మల్లన్నసాగర్ ముంపు గ్రామాలైన వేములఘాట్, ఎర్రవల్లి, పల్లెపహాడ్ గ్రామాల్లో పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో నేతల బృందం పర్యటించనున్నట్లు తెలిపారు. గ్రామాల్లో పర్యటించి రైతులను ఓదార్చుతామన్నారు. ఈ సమావేశంలో కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ రాజశేఖర్, కాంగ్రెస్ ఇంచార్జి శ్రీనివాస్‌గౌడ్, నాయకులు గూడూరి శ్రీనివాస్, ప్రభాకర్‌వర్మ, అత్తుఇమాం, సతీష్, యాదగిరి, అంజిరెడ్డి, నాగరాజు, సారుూశ్వర్ తదితరులు పాల్గొన్నారు.