మెదక్

ప్రభుత్వం ప్రత్యామ్నాయం వెతకాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జిన్నారం, జులై 25: ముంపుగ్రామాల బాధితులతో చర్చించి ప్రభుత్వం ప్రత్యామ్నాయాన్ని వెతకాలని జెఎసి చైర్మెన్ కోదండరామ్ అన్నారు. మల్లన్నసాగర్ బాధితుల పరామర్శకు వెళ్ళుతున్న కోదండరామ్‌ను మెదక్ జిల్లా ములుగులో పోలీసులు అరెస్టు చేశారు. ఇక తూప్రాన్‌లో డిసిసి అధ్యక్షురాలు, మాజీ మంత్రి సునీతారెడ్డిని అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం కోదండరామ్ మాట్లాడుతూ మల్లన్నసాగర్‌పై ప్రభుత్వం చర్య దౌర్జన్యంగా వుందని ఆరోపించారు. ఆ పద్ధతులను విడనాడి గ్రామస్థులతో చర్చించి ప్రత్యామ్నాయ మార్గాలను అనే్వషించాలని సూచించారు. తాము ప్రజాస్వామ్య పద్ధతిలో బాధితులను పరామార్శించడానికి వెళ్ళితే పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మాజీ మంత్రి సునీతారెడ్డి మాట్లాడుతూ రైతుల భూములను ముంపునకు గురిచేసి, రైతులను ఇబ్బందులకు గురిచేసే మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమన్నారు. ప్రాణహితద్వారా సాగునీరు ఇవ్వాలని ఆమె సూచించారు. భూనిర్వాసితులు గాంధేయ మార్గంలో నిరసన తెలపడానికి వెళితే పోలీసులు అత్యాత్సాహాన్ని ప్రదర్శించి లాఠీ చార్జీ చేశారని అన్నారు.