మెదక్

భారీ వర్షం.. రైతుల్లో ఆనందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్, జూలై 28: మెదక్‌లో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. పగలంతా ఎండలు కాచాయి. సాయంత్రం 5:30 గంటల ఊరుములు, మేరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈ వర్షం రైతులు, ప్రజలలో ఆనందం నింపింది. రైతులు నారుమల్లు పోసి పొలాలు దుక్కులు దున్నుకొని సిగత వారం రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో గురువారం కురిసిన భారీ వర్షంతో రైతులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం 20 శాతం అధికంగా వరి పంటలకు రైతులు మొగ్గుచుపారని మెదక్ వ్యవసాయ శాఖ అధికారి రెబల్‌సన్ మాట్లాడుతూ తెలిపారు. 1010 రకం విత్తనాలు అత్యధికంగా రైతులు ఖరీదు చేసి నారుమల్లు పోసుకున్నట్లు తెలిపారు. దేవుని చెరువులోకి నీళ్లు వస్తున్నట్లు ఆ గ్రామ ప్రజలు తెలిపారని ఎఓ రెబల్‌సన్ తెలిపారు. మెదక్ డివిజన్‌లో అత్యధికంగా మొక్కజొన్న వేశారు. పప్పుదినుసులు కూడా వేశారు. ఈ పంటలకు వరినాట్లకు ఈ వర్షం సహకరిస్తుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముసురు వానలతో రైతులు నారుమల్లు పోసుకున్నారు. దుక్కులు సిద్ధం చేసుకున్నారు, బోరుమోటార్ల వద్ద నాట్లు ప్రారంభమయ్యాయి. ఈ వర్షంతో పొలాలన్నియు కూడా సాగుకు నోచుకుంటాయని ఎఓ రెబల్‌సన్ తెలిపారు. ఈ వర్షంతో రోడ్లన్ని నీటిమయమయ్యాయి. వర్షంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. పట్టణమంతా చీకటిమయంగా మారింది.