మెదక్

విస్తరిస్తున్న అతిసార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోగిపేట, జూలై 29: జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అతిసార(డమేరియా) వ్యాధి రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం నాటికి 80 మంది వరకు చేరుకున్నారు. గత మూడు రోజుల క్రితం కౌడిపల్లి మండలం బండపోతుగల్‌లో సోకిన అతిసార వ్యాధి రోజురోజుకూ విస్తరిస్తోంది. బండపోతుగల్‌తో పాటు వివిధ గ్రామాలకు చెందిన వారు కూడా ఆస్పత్రిలో చేరుతున్నారు. జోగిపేట ప్రభుత్వ అధికారులు 34 మంది రోగులను సంగారెడ్డి ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వ వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. బండపోతుగల్ రోగులను కౌడిపల్లి ఎంపిపి పద్మ నర్సింహారెడ్డి, కౌడిపల్లి ఎస్సై శ్రీనివాస్‌లు అక్కడికి చేరుకొని పరిశీలించారు. రోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి అమర్‌సింగ్ సిబ్బందిని ఆదేశించారు. అతిసార వ్యాధిపై అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నివారణకు చర్యలు తీసుకుంటున్నారు.
రోగులను పరామర్శిన ఎమ్మెల్యే మదన్‌రెడ్డి
జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అతిసార వ్యాధి సోనిక రోగులను శుక్రవారం నాడు నర్సాపూర్ శాసనసభ్యులు మదన్‌రెడ్డి పరామర్శించారు. కౌడిపల్లి మండలం బండపోతుగల్ గ్రామానికి చెందిన అతిసార వ్యాధి రోగులు గత మూడు రోజులుగా జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే మదన్‌రెడ్డి వెంట జిల్లా వైద్యాధికారి అమర్‌సింగ్, డిసియం అధ్యక్షులు గోవర్దన్‌రెడ్డి, ఆస్పత్రి వైద్యులు సంగారెడ్డి, సత్యనారాయణలు ఉన్నారు. అతిసార వ్యాధి సోకిన రోగులను ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహించి అవసరమైతే జిల్లా కేంద్రానికి తరలించాలని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అధికారులకు సూచించారు. ఈ వ్యాధి సోకడంపై ఆయన రోగులను అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమయ్యే మందులను కూడా నిలువ ఉంచాలని అధికారులను కోరడం జరిగింది.