మెదక్

మల్లన్నసాగర్‌తోనే.. జిల్లా ప్రజల మనుగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, జూలై 29 : మల్లన్నసాగర్‌తోనే జిల్లా ప్రజల బ్రతుకు అని శాసన సభ ఉప సబాపతి పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని మల్కాపూర్ గ్రామంలో లక్ష మొక్కలు నాటిన సందర్భంగా పాల్గొన్న సభలో మాట్లాడారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా, జిల్లాలో ఆత్మహత్యలు, వలసలు, కరువులు నివారించడానికి మల్లన్నసాగర్ నిర్మించి తీరుతామని ఆమె అన్నారు. ప్రభుత్వం ప్రజలతో కలిసిచేసే ప్రజాయుత కార్యక్రమాలు మిషన్ కాకతీయ, మిషన్ బగీరథ, హరితహారం, మల్లన్నసాగర్‌లాంటి కార్యక్రమాలు దేశంలోనే రాష్ట్రం మొదటిస్థానం నిలిచిందని ఇతర రాష్ట్రాలు తెలంగాణాను ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు. చెట్టు తల్లిలాంటిదని, చెట్టును రక్షిస్తే ప్రాణాన్ని కాపాడినట్లేనని చెట్లు లేకపోవడం వల్లనే కరువులు సంభవిస్తుందన్నారు. చెట్లు లేకపోవడం వల్లనే ఓజోన్‌పొరకు రంద్రం ఏర్పడిందని, రంద్రం పెద్దదైతే మానవమనుగడకు కష్టమన్నాను. లక్ష మొక్కలు నాటిన మల్కాపూర్ గ్రామస్థులు రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచారని, యువతతోనే అభివృద్ది సాద్యమన్నారు. ముఖ్యమంత్రి కెసిఅర్ రాష్ట్రంలో గత 60 సంవత్సరాలుగా ఉన్న సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తున్నారని, ప్రతిపక్షాలు ఎన్ని ఉద్యమాలు చేసినా ప్రజలతో కలిసి చేసిన ప్రజాయుత కార్యక్రమాలు చేసి విజయం సాదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిఅర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఎలక్షన్‌రెడ్డి, అదనపు ఫారెస్ట్ ప్రిన్సిపాల్ డోబ్రియల్, డ్వామా పిడి సురేందర్, గఢా అధికారి హన్మంతరావు, స్పెషల్ ఆఫీసర్ కోటేశ్వర్‌రావు, ఎంపిడిఒ శ్రీనివాస్‌రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్శైలంగౌడ్, జెడ్‌పిటిసి సుమనవిజయభాస్కర్‌రెడ్డి, మండల ఉపాధ్యక్షులు అనంతరెడ్డి, తహశీల్దార్ వెంకటనర్సింహారెడ్డి, సర్పంచ్ స్వామి, నేతలు శేఖర్‌గౌడ్, పెంటాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.