మెదక్

బోనం..్భక్తజన పారవశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, జూలై 31: ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని బోనాల పండుగ ఉత్సవాలు ఆదివారం జిల్లాకేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణంలో పురాతనంగా వస్తున్న మహాశక్తివంతమైన దుర్గమ్మతల్లి బోనాల జాతర మహోత్సవాన్ని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) పూర్తి సహాయ సహకారాలతో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. పాత బస్టాండ్ ఆవరణను రంగు రంగుల పూలు, మామిడి, వేప తోరణాలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఆదివారం సాయంత్రం 5గంటలకు రాంమందిర్‌లో జగ్గారెడ్డి తొట్టెలకు ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాల ఊరేగింపును ప్రారంభించారు. డప్పుచప్పుళ్లు, శివసత్తులు, పోతురాజుల విన్యాసాలు, కళా బృందాలు వివిధ రూపాల్లో అలంకరించుకొని చేసే నృత్యాల మద్య ఊరేగింపు కొనసాగింది. వేలాది మంది భక్తులతో నల్లపోచమ్మ, భావానీమాత ఆలయం మీదుగా పట్టణ శివారులోని దుర్గమ్మతల్లి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆషాడమాసం చివరి రోజు కావడంతో పట్టణ ప్రజలతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో హజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు.
అందరూ సుఖసంతోషాలతో ఉండాలి: జగ్గారెడ్డి
దుర్గమ్మతల్లి కృపతో ప్రతి ఒక్కరు ఆయురాగ్యాలతో పాటు సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. వర్షాలు సంవృద్ధిగా కురిసి పంటలు బాగా పండి రైతుల కండ్లల్లో ఆనందం నింపాలన్నారు. రైతు సుభిక్షంగా ఉంటేనే రాష్టమ్రంతా సుభిక్షంగా ఉంటుందన్నారు. ఇంత పెద్దయేత్తున ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అంతకు ముందు పట్టణంలోని సాయిబాబా, అస్తబల్‌లోని ఎల్లమ్మతల్లి, నల్లపోచమ్మ ఆలయాల్లో జగ్గారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.