మెదక్

డిసిసిబిని మొదటి స్థానంలో నిలుపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 4: జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సేవలను విస్తరించి ప్రజలకు, రైతాంగానికి మెరుగైన సేవలందించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సూచించారు. సంగారెడ్డిలోని డిసిసిబిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎటిఎం సేవలను గురువారం చైర్మన్ చిట్టి దేవేందర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలోనే డిసిసిబి మొదటి ఎటిఎంను సంగారెడ్డిలో ప్రారంభించుకోవడం అభినందనీయమన్నారు. కమర్షియల్ బ్యాంకులకు దీటుగా సేవలందించాలని కోరారు. బ్యాంకు రుణాలు ఇవ్వడం, వసూలు చేయడంలో రాష్ట్రంలోనే మెదక్ జిల్లా డిసిసిబి రెండవ స్థానంలో నిలవడం సంతోషకరమన్నారు. 9వ స్థానంలో ఉన్న బ్యాంకును రెండవ స్థానంలోకి తీసుకరావడం ఒక అద్బుతమని, ఇందుకు బ్యాంకు అధికారులు, సిబ్బంది, పాలకవర్గాన్ని అభినందించారు. బ్యాంకు అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానన్నారు. డిసిసిబి చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే రెండవ స్థానంలో ఉన్న బ్యాంకు సేవలను మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. 2016-17కు సంబంధించి రూ.350కోట్ల స్వల్పకాలిక (క్రాప్‌లోన్స్) రుణాలు ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. దీర్ణకాలిక రుణాలు (ఎల్‌టి లోన్స్) కింద రూ.200 కోట్లు టార్గెట్ రుణాలుగా ఇవ్వాలని నిర్ణయించామన్నారు. జెఎల్‌జి గ్రూప్ కింద విజయ డైరీ వారితో జిల్లాలో సిద్ధిపేట, గజ్వేల్, తూఫ్రాన్, దుబ్బాక ప్రాంతాల్లో రూ.100కోట్ల రుణాలు ఇవ్వడం జరిగిందని, ఈ యేడాది జహీరాబాద్, మెదక్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో జెఎల్‌జి గ్రూప్ రుణాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఎస్‌హెచ్‌జి గ్రూప్‌లకు రూ.500కోట్లు, ఎఎఫ్‌ఎస్ కింద రూ.500కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వాహనాలు, వ్యాపారంతో పాటు మున్సిపాల్టీల్లో గృహ నిర్మాణ రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలో జిల్లాలోని అన్ని బ్రాంచిలకు ఎటిఎం సదుపాయం కల్పిస్తామన్నారు. రైతులకు, ఖాతాదారులకు మెక్రో ఎటిఎం సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. డిసిసిబిలో చేసిన డిపాజిట్లను జిల్లా అభివృద్ధికే వినియోగిస్తామని, ప్రతి ఒక్కరు డిపాజిట్లు చేసి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సమావేశంలో డిసిసిబి వైస్ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, నాబార్డ్ డిజిఎం రమేష్, సిఈఓ శ్రీనివాస్, డైరెక్టర్లు అనంతరెడ్డి, మోహన్‌రెడ్డి, పాలక వర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.