మెదక్

మల్లన్నసాగర్‌పై హైకోర్టు తీర్పు హర్షణీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 5: మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల పక్షాన హైకోర్టు తీర్పునివ్వడం హర్షణీయమని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి (జగ్గారెడ్డి) పేర్కొన్నారు. 123జివోను రద్దు చేస్తూ తెరాస ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసినా సుప్రీంకోర్టు అప్పీల్‌కు వెళ్తాననడం సిగ్గుచేటన్నారు. శుక్రవారం సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతుల పొట్టకొట్టే 123జివో చట్టం వద్దని, వారి పొట్టనింపే 2013 జివోను అమలు చేయాలన్నారు. భూ నిర్వాసితులపై ప్రతిపక్షాలు పోరాటం చేస్తే అణిచివేసే ప్రయత్నాలు చేశారని, హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టాన్నారు. ఎవ్వరు అడ్డువచ్చిన ప్రాజెక్టును నిర్మించి తీరుతామన్న మంత్రి హరీష్‌రావుకు దిమ్మతిరిగేలా తీర్పు వచ్చిందన్నారు. రైతాంగ కడుపులు కొట్టాలని చూసే ప్రభుత్వాలు మనుగడ సాధించలేవన్నారు. ముంపుగ్రామాల ప్రజలను నిర్భాందాలకు గురి చేసి బయటకు రాకుండా చేయడం దుర్మార్గమన్నారు. కాంగ్రెస్ రైతు పక్షపాతని, రైతుల శ్రేయస్సు కోరే పార్టీ అన్నారు. మళ్లీ 123 జివోను అమలు చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. హామీలతో ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చి విస్మరించారని, ఒకే దఫా రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.ప్రజలు అవకాశమిస్తే రైతాంగానికి అన్ని విధాల న్యాయం చేస్తామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ అసమర్ధత పాలనపై ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి ఈ నెల 7న వినతి పత్రాన్ని సమర్పిస్తామని, ఇందుకు అనుమతించాలని కోరుతూ జిల్లా ఎస్పీకి వినతి పత్రాన్ని సమర్పించనున్నట్లు తెలిపారు. సిఎం కెసిఆర్ అందుబాటులో ఉండడని, ప్రజాప్రతినిధులు కలిసేందుకు వెళితే టైం కూడా కేటాయించరని, రాష్ట్ర రైతాంగ, ప్రజల సంక్షేమంపై ప్రధానికి వినతి పత్రాన్ని సమర్పిస్తామన్నారు. అనుమతి ఇవ్వని పక్షంలో ప్రధాని సభా ప్రాగంణం వద్ద 2వేల మందితో నిరసన వ్యక్తం చేస్తామన్నారు. ప్రధాని కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా లేఖను పంపించనున్నట్లు తెలిపారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.