మెదక్

హామీలన్నీ అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, ఆగస్టు 5: ఎన్నికలకు ముందు తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామిలను అమలు చేయాలని, హామీల అమలుకు ప్రజల పక్షాన పోరాటం నిర్వహిస్తామని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలు జి.శశికళ యాదవరెడ్డి అన్నారు. ప్రభుత్వ పాలనను వ్యతిరేకిస్తూ, హామిలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాకేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యితిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు శశికళ యాదవరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు అనేక హామిలిచ్చి అధికారంలోకి వచ్చి విస్మరించడం సరికాదన్నారు. దళితులకు 3ఎకరాల భూమి, ఇంటికో ఉద్యోగం, రైతు రుణమాఫీ, డబుల్‌బెడ్‌రూం తదితర హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత ముఖ్యమంత్రిని చేస్తానన్న కెసిఆర్ తానే పదవిని అనుభవించడం ఎంత వరకు సమంజసమన్నారు. రెండు విడతల రుణమాఫీ ఇచ్చిన రైతాంగానికి ఎలాంటి ప్రయోజనం లేదని, ఒకే ధపా రుణమాఫీ చేయాలని, డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం ఎర్రవెల్లిలో తప్పా ఇతర ప్రాంతాల్లో వాటి ఊసే లేదన్నారు. మాటల గారడితో మభ్యపెట్టి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 123జివోను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పునివ్వడం ప్రభుత్వానికి చెంపపెట్టాన్నారు. నిర్వాసితులపై అక్రమంగా నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ టిడిపి మాజీ ఎమ్మెల్యే విజయపాల్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనం మల్లన్నసాగర్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పన్నారు. మొండి వైఖరితో వ్యవహరించడం మంచి పద్దతి కాదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామిలన్ని అమలు చేసేంత వరకు టిడిపి ఉద్యమిస్తుందని హెచ్చరించారు. అనంతరం కలెక్టరేట్ పరిపాలన అధికారి మహిపాల్‌రెడ్డికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ధర్నాలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సరాప్ యాదగిరి, నాయకులు శ్రీనివాస్‌గౌడ్, తెలుగు యువత జిల్లా అధ్యక్షులు ఎడ్ల రమేష్, నాయకులు స్వామిగౌడ్, బీరయ్యయాదవ్, మహిపాల్‌గౌడ్, మాణిక్య ప్రభు, అశోక్, గోపాల్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, తాటికొండ రమేష్, ఎండి ఖాజా, వివి నర్సింలు, భూపాణి, మహేష్, జోగినాథ్, నరేందర్‌చక్రవర్తిగౌడ్, తుల్జారెడ్డి, శ్రీనివాస్, మల్లేశంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.