మెదక్

పేదల కష్టాలు చాయ్‌వాలా మోదీకి తెలుసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, ఆగస్టు 7: తెలంగాణ ప్రజల హృదయాల్లో కల్లా కపటం లేశమంత కూడా ఉండదని, కష్టపడి పని చేయడం ఒక్కటే తెలుసని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్ మండలం కోమటిబండ వద్ద జరిగిన భారీ బహిరంగ సభలో దత్తాత్రేయ స్వాగతోపన్యాసం చేసారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన మొదటి సారి ప్రధాని మోది రాష్ట్ర పర్యటనకు రావడం సంతోషకరమన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం 17 వేల కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. తాగునీటితో దాహం తీరుతుందని, విద్యుత్ ఉత్పత్తితో చీకట్లు తొలిగిపోతాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి వనరులు అంతంతగానే ఉన్నాయని, గోదావరి నది నుంచి అనేక టిఎంసిల నీరు సముద్రం పాలవుతుందన్నారు. వృథాగాపోతున్న గోదావరి జలాలను వెనక్కు మళ్లించి బీడువారిన పొలాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రధాని సహకారం అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. చేనుకునీరు, చేయికి పని ఉంటే తెలంగాణ ప్రజలు ఏ పని చేయడానికైనా వెనుకడారని, కపటం లేకుండా పని చేసి జీవిస్తారన్నారు. ప్రధాని మోదీకి పేదల కష్టాలు అంటే ఏమిటో తెలుసని, ఒకప్పుడు చాయ్‌వాలాగా జీవితాన్ని ప్రారంభించి ఇప్పుడు దేశ ప్రధానిగా పారదర్శకమైన పాలనను అందిస్తున్నారని సంతృప్తిని వ్యక్తం చేసారు.
రాష్ట్ర అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తారన్న ఆశాభావాన్ని దత్తాత్రేయ వ్యక్తం చేశారు.