మెదక్

భక్తిశ్రద్ధలతో శుభ శుక్రవారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెదక్: మరణం ఓటమి కాదు, ఈ రోజుల్లో క్షమాపణకు విలువలేదని మెదక్ పాస్నేట్ ప్రిసిబిటరి ఇన్‌చార్జి రెవ.వై.ర్యాబిన్‌సన్ అన్నారు. శుక్రవారం నాడు మెదక్ మహా దేవాలయంలో జరిగిన శుభ శుక్రవారం (గుడ్‌ఫ్రైడే)ను ఉద్దేశించి రెవ.ర్యాబిన్‌సన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. మధ్యాహ్నం 11:30 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఈ ఆరాధన కార్యక్రమం కొనసాగింది. ఏసుక్రీస్తు లోక కల్యాణం నిమిత్తం భూలోకానికి వచ్చాడని ఆయన తెలిపారు. మన యతిక్రమ క్రియలను బట్టి ఏసుక్రీస్తు గాయపర్చబడెను, మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్దమైన శిక్ష ఏసుక్రీస్తు మీద పడెను, ఏసుక్రీస్తు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని పేర్కొన్నారు. ఏసుక్రీస్తు శిలువపై మాట్లాడిన ఏడు మాటలను ఉద్దేశించి రెవ.విజయ్‌కుమార్, బి.శీల ప్రదీప్, రెవ.సిహెచ్.జార్జ్, అనిత సాంసన్, టి.రోలాండ్‌పాల్, రెవ.ఎం.ప్రశాంతబాబులు వివరించారు. గుడి ప్రాంగణం చుట్టంతా టెంట్లు ఏర్పాటు చేశారు. భక్తులకు మంచినీటి వసతులు భారీయేత్తున ఏర్పాటు చేశారు. రెవ.వై.విజయ్‌కుమార్ మాట్లాడుతూ క్షమాపణ అనే మాటకు అనేక మందిని నిర్దోషులుగా ఏసుక్రీస్తు ప్రకటించారని తెలిపారు. ఏసుక్రీస్తు శిలువమీద దేవదేవునిగా పలికిన మాటలు వివరించారు. శత్రువులను ప్రేమించండని, హింసించువారి కొరకు ప్రార్దించండని ఏసుక్రీస్తు తెలిపిన విషయాలను ఆయన గుర్తు చేశారు. ప్రతి వ్యక్తి నీతిని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. భక్తులందరు తెల్లని వస్త్రాలతో గుడ్‌ఫ్రైడేకు హాజరయ్యారు. ఎంతో మంది భక్తులు వారి వారి తప్పులను మనస్సులో ఒప్పుకొని దేవాలయంలో భక్తిశ్రద్ధలతో ఆరాధనలో పాల్గొన్నారు. అంతకు ముందు రెవ.ర్యాబిన్‌సన్, రెవ.విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో గురువులు, మెదక్ కెతిడ్రల్ పాస్నేట్ బిషప్స్ కమిషన్ సభ్యులు గుడి ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ కెతిడ్రల్ పాస్నేట్ బిషప్ కమిషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

పగటిపూటే..
9గంటల నాణ్యమైన విద్యుత్
కొండపాక, మార్చి 25: పగటిపూటనే రైతులకు నాణ్యమైన 9గం. విద్యుత్ ఇచ్చి రైతుల ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేస్తామని నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని వెలికట్టలో నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం వెలికట్ట ఎంపిటిసి స్వర్గీయ బూర్గుల యాదంరావు విగ్రహావిష్కరణ చేసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండేండ్లు పూర్తికాకముందే వెలికట్ట గ్రామానికే 16కోట్లు అభివృద్ధి పనుల కోసం మంజూరు చేశామన్నారు. అలాగే గ్రామంలో ఫంక్షన్‌హాల్, వైకుంఠదామం నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామన్నారు. 60ఏండ్లలో కాని అభివృద్ధి 2ఏండ్లలతో పూర్తిచేసిన ఘటన టిఆర్‌ఎస్ సర్కార్‌దేనన్నారు. వెలికట్ట అంటే సిఎం కెసిఆర్, తనకు ఎంతో అభిమానం ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో రాత్రింబవళ్లు తెలంగాణ కోసం పోరాడింది గ్రామ ప్రజలు అన్నారు. బంగారు తెలగాణ సాధనకు అందరు కృషి చేయాలన్నారు. వెలికట్ట ఎంపిటిసి యాదంరావు మృతితో గ్రామం మంచి నాయకున్ని కోల్పోయిందన్నారు. 24గం. ప్రజల కోసం పని చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. వెలికట్టనుంచి ఆరెపల్లి రోడ్డు కోసం అనేకసార్లు నిధుల కోసం అడిగారన్నారు. ఆయన కోరిక మేరకు నిధులు మంజూరు చేసి నిర్మిస్తున్న రోడ్డును చూసే భాగ్యం కలుగలేదన్నారు. త్వరలోనే మిషన్ భగీరథ ద్వారా ఇంటింటా మంచినీరు అందిస్తామన్నారు. దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీరు తెచ్చేందుకు నిర్మిస్తున్న కాల్వ పనులను పరిశీలించారు. నాణ్యతా ప్రమణాలతో కాల్వ పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపి ప్రభాకర్‌రెడ్డి, డిసిసిబి చైర్మన్ దేవేందర్‌రెడ్డి, ఎంపిపి పద్మ, జడ్పిటిసి మాధురి, గడా అధికారి హన్మంతరావు పాల్గొన్నారు.