మెదక్

భవిష్యత్తునిచ్చే గురువే తొలి దైవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి టౌన్, సెప్టెంబర్ 9: తల్లిదండ్రులు జన్మనిస్తే భవిష్యత్తునిచ్చేది విద్యను బోధించే ఉపాధ్యాయులేనని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవ సందర్భంగా శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సంగారెడ్డి మండల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా కళోజీ జయంతి పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ముఖ్య అతిధిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ భావి భారత సమాజ రూప కల్పనలో ఉపాధ్యాయులదే కీలక ప్రాత అన్నారు. మైనపు ముద్దలాంటి విద్యార్థులను బొమ్మలుగా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులకు సూచించారు. శిలలు లాంటి వారిని శిల్పాలుగా మలిచే నైపుణ్యం ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందన్నారు. ఎంఈఓ వెంకటేశం మాట్లాడుతూ ఉపాధ్యాయులందరూ నిస్వార్ధంగా విద్యాబోధన చేయాలని సూచించారు. విద్యార్థులు ఉన్నతస్థాయికి ఎదిగినప్పుడు ఉపాధ్యాయులు పొందే ఆనందం వర్ణణాతీతమన్నారు. అనంతరం మండల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 21మంది ఉపాధ్యాయులను శాలువా, మెమోంటోలతో సత్కరించారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు మురళీయాదవ్, సిడిసి చైర్మన్ విజయేందర్‌రెడ్డి, మండల అధ్యక్షులు చిల్వెరి ప్రభాకర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.