మెదక్

కుంభవృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, సెప్టెంబర్ 23: గజ్వేల్ నియోజకవర్గంలో సంవృద్దిగా వర్షాలు కురవడంతో చెరువులు, కుంటలు జలకళలాడుతున్నాయి. గజ్వేల్, వర్గల్, ములుగు, జగదేవ్‌పూర్, తూప్రాన్, కొండపాక మండలాల పరిధిలోని 5వందలకుపైగా చెరువులు, కుంటలలో సంవృద్దిగా వరద నీరు వచ్చి చేరడంతో మత్తడుల నుండి పరవళ్ళు తొక్కుతున్నాయి. ముఖ్యంగా గత ఆరేడు సంవత్సరాలుగా వరుణుడు కరుణించక చెరువులు, కుంటలు ఎడారుల్లా దర్శణమివ్వగా ప్రస్థుత వర్షాకాలంలోని చివరి కార్తెలో వరుణుడు కరుణించడంతో పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది. కాగా నియోజకవర్గ పరిదిలోని అహ్మదీపూర్ పెద్ద చెరువు, గజ్వేల్ పాండవుల చెరువులలో సంవృద్దిగా వర్షపు నీరు వచ్చి చేరడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే గత ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆరుతడి, కూరగాయల పంటలకు నష్టం జరుగనుండగా, 50 వేల హెక్టార్లలో సాగు చేసిన వరి, మొక్కజొన్న, పత్తి పంటలకు ప్రయోజనం జరుగనుంది. అంతేగాకుండా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గ్రామీన రోడ్లపై నీరు వచ్చి చేరడంతో రోడ్లు అస్తవ్యస్తంగా మారాయి. అలాగే 7 సంవత్సరాల అనంతరం పిడిచెడ్, దిలాల్‌పూర్, బయ్యారం చెరువులు నీటితో నిండిపోగా, నాచారం హల్దీ ప్రాజెక్ట్ నుండి వరద నీరు పరవళ్ళు తొక్కుతోంది. హల్దీ వాగు, కుడ్లేరు వాగులపై నిర్మించిన చెక్‌డ్యాంలలో నీరు చేరి ప్రవహిస్తుండగా, బూగర్బ జల మట్టం పెరిగి ఎలాంటి సాగునీటి వనరులులేని నియోజకవర్గంలో పంట దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఏర్పడింది. శుక్రవారం ఉదయం జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్‌రాంరెడ్డి, గఢా అధికారి హన్మంతరావు, ఇరిగేషన్ కన్సల్టెంట్ మల్లయ్య తదితరులు నియోజక వర్గ పరిదిలోని ఆయా చెరువులను పరిశీలించారు.