మెదక్

దౌర్జన్యంగా భూములు లాక్కోవడం దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన మాత్రమే కొనసాగుతుందని...ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ దౌర్జన్యంగా ప్రజల అభిష్టాన్ని కాదని ప్రాజెక్టుకు భూములు లాక్కోవడం దారుణమని.. సింగూరు బాధితుల పోరాటాల స్ఫూర్తితో వేములగాట్ దీక్షలు అభినందనీయని ఎఐసిసి కార్యదర్శి, మాజీ రాజ్యసభ సభ్యులు విహెచ్ హన్మంతరావు అన్నారు. మంగళవారం మెదక్ జిల్లా తొగుట వేములగాట్‌లో ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గ్రామస్థులు చేపట్టిన 115వ రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపి మాట్లాడారు. మండలంనీటి లభ్యతలేని చోట నిర్మించాల్సిన ప్రాజెక్టును రెండు పంటలు పండే భూముల్లో నిర్మించాలనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. 1.5 టిఎంసిల ప్రాజెక్టుతో సాగునీరు అందించే అవకాశాలను గతంలో వైస్ సర్కార్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ద్వారా రూపకల్పన చేస్తే దాన్ని కాదని 50టిఎంసిలకు పెంచి ప్రజలను నష్టాలకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్పోరేట్ వారికి మేలు చేకూర్చి, సామాన్య ప్రజలకు నష్టం కల్గించడం భావ్యమా అని ప్రశ్నించారు. సోనియా గాంధి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. ఇచ్చిన దాన్ని టిఆర్‌ఎస్ జాగీరుగా అనుకుంటే ప్రజలు ఊరుకోరన్నారు. ప్రజలు ప్రభుత్వ చర్యలను గమనిస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తగురీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. పశ్చిమ బెంగాల్‌లో సింగూరు బాధితులు 12ఏండ్ల పాటు అలుపెరగని పోరాటం చేసి విజయం సాధించారని, నిర్వాసితులకు వారి పోరాటాల ఫలితంగా భూములతో పాటు పరిహారం సైతం రావడం జరిగిందన్నారు. ఆ స్పూర్తితో వేములగాట్ వాసులు చేస్తున్న పోరాటం కొనసాగాలని, ప్రక్క గ్రామాల్లో సైతం విస్తరింప చేయాలని సూచించారు. వేములగాట్ ప్రజల చేస్తున్న పోరాటం అందరకి ఆదర్శంగా నిలుస్తుందనడంలో అతిశయోక్తిలేదన్నారు. సంఘటితంగా ప్రజలు చేస్తున్న పోరాటాలు తప్పక విజయం సాధిస్తాయన్నారు. 2013చట్టం ప్రకారం నిర్వాసితులకు తప్పకుండా అన్ని విధాలుగా న్యాయం జరుగుతుందన్నారు. ప్రజలను నష్టపరిచే 123ను ఒప్పుకోవద్దన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వం ప్రజల అభిష్టాలను, ప్రతిపక్షాలను సైతం పట్టించుకోకుండా ఇష్టరీతిగా వ్యవహరిస్తుందని అది అంత మంచిదికాదన్నారు. ప్రజలను భయాందోళనకు గురిచేసేందుకు గ్రామాల్లో పోలీస్ ఫికెటింగ్‌లు, 144 సెక్షన్లు ఏర్పాటు చేయడం సరికాదని, కోర్టు వాటిని తొలగించాలని ఆదేశాలివ్వడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వేములగాట్ ప్రజలు అభినందనీయులని, కాంగ్రెస్ పార్టీ ప్రజల పోరాటానికి సంపూర్ణ మద్దతుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి నాయకులు గంప మహేందర్‌రావు, పొల్లు కిషన్, మైనార్టీసెల్ ఉపాధ్యక్షుడు సికిందర్, నేతలు గడీల శ్రీనివాస్‌రెడ్డి, అంజద్ తదితరులు పాల్గొన్నారు.