మెదక్

పేటలో కూలిన పురాతన ఇల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సదాశివపేట, సెప్టెంబర్ 29: దశాబ్దాల క్రితం నిర్మించి శితిలావస్థకు చేరుకున్న పురాతన ఇల్లు సదాశివపేట మున్సిపల్ పట్టణంలో గురువారం మిట్ట మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూలిపోయింది. డబేల్ మంటూ శబ్దం చేస్తూ ఇల్లు కూలడంతో ఇరుగు, పొరుగు ఇళ్లలోని ప్రజలు బయటకు పరుగులు పెట్టగా ఇంట్లో ఉన్న నాలుగురిని ఒక్కసారిగా అతాసులను చేసింది. పట్టణంలోని 22వ వార్డులో అల్లాదుర్గం నాగమణికి చెందిన ఇల్లు ఎప్పుడో పూర్వీకులు మట్టి గోడలపై నిర్మించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇంటి గోడలు పూర్తిగా తడిసిపోయాయి. వర్షాలు కురుస్తున్నప్పుడే ఏలాంటి ప్రమాదం సంభవించలేదని, వర్షాలు నిలిచిపోయాయన్న విశ్వాసంతో ఆ కుటుంబం అదే ఇంట్లో నివసిస్తోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ ఇళ్ల నిర్మాణాలతో పోలిన దుద్యాల బస్వారాజ్ ఇల్లు కూడా శితిలమై ఇటీవల కురిసిన వర్షాలకు బయటి గోడలు కూలిపోయాయి. తాజాగా అల్లదుర్గం నాగమణి ఇల్లు కూడా అదే మాదిరిగా కూలింది. ఊహించని విధంగా ఇల్లు ఒక్కసారిగా కూలడంతో బయటకు రాలేని పరిస్థితుల్లో చిక్కుకున్న నాగమణి, సురేష్, సుశీల, బాలుడు ప్రద్నీక్‌లను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు తక్షణం స్పందించి బాధితులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. కాగా ఈ ప్రమాదంలో ఎవరికి కూడా చిన్నపాటి గాయం కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటన స్థలానికి సంగారెడ్డి ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డి, తహశీల్దార్ గిరితో పాటు మున్సిపల్ అధికారులు చేరుకున్నారు. ప్రభుత్వ పరంగా తగిన ఆర్థిక సహాయం అందిస్తామని ఆర్డీవో ఈ సందర్భంగా పేర్కొన్నారు.