మెదక్

బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 30: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయలకు అద్దంపట్టే బతుకమ్మ సంబరాల్లో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ఆనందోత్సాహాల మధ్య కన్నులపండువగా జరుపుకోవాలని ఓఎస్డీ బాల్‌రాజ్ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక కోమటిచెరువు బతుకమ్మ విగ్రహం వద్ద బతుకమ్మ పాటల సీడిని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్‌ఎస్ ప్రభుత్వం బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహిస్తుందన్నారు. బతుకమ్మ సంబురాలను రాష్ట్ర పండుగగా గుర్తించి అన్ని ఏర్పాట్లు చేస్తుందన్నారు. తరాలుగా బతుకమ్మ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, మహిళలు ఎంతో భక్తి శ్రద్దలు, ఇష్టంగా జరుపుకునే పండుగ అన్నారు. సీడి ద్వారా మహిళలకు బతుకమ్మ పాటల పై అవగాహన కలిగే అవకాశం ఉందని, సీడిలు 9రోజులు పాటలు వింటు బతుకమ్మ సంబరాలను ఉత్సాహంగా జరుపుకోవాలన్నారు. సీడిని టీచర్ సువర్ణ రూపొందించడం అభినందనీయమన్నారు. మాజీ ఎంఇఓ రఘోత్తంరెడ్డి, వేణుగోపాలస్వామి, తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జమీరుద్దీన్, బాపురెడ్డి, రాంచంద్రారెడ్డి, సుజాత, మానస, జయశ్రీ, నిర్మల, పద్మ తదితరులు పాల్గొన్నారు.