మెదక్

నాణ్యమైన ఔషధాలనే అందించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సాపూర్, మార్చి 17: నాణ్యమైన మందులను మాత్రమే ప్రజలకు అందించాలని మెదక్ డివిజన్ డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్ విజయ్‌సుష్మీ సూచించారు. గురువారంనాడు నర్సాపూర్‌లో ఏర్పాటు చేసిన మెడికల్ షాపుల యాజమానుల సమావేశానికి ఆమె హాజరయ్యారు. ఈసందర్భంగా ఆమే మాట్లాడుతూ ప్రతి మందుల దుకాణంలో నాణ్యమైన మందులను మాత్రమే ప్రజలకు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజల ప్రాణాల రక్షణ కోసం ప్రతి మందుల షాపువారు ఆలోచించాలని అన్నారు. డాక్టర్ల చిట్టి లేనిదే మందులు ఇవ్వకూడదని సూచించారు. ప్రభుత్వం నిలిపివేసిన మందుల స్టాక్‌ను తిరిగి పంపాలని సూచించారు. ప్రతి మందుల షాపులో ఫార్మసిస్టు తప్పని సరిగా ఉండాలని లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈనెలలో మెడికల్ షాపులలో దాడులు జరిగే అవకాశాలున్నాయని నిబంధనలకు విరుద్ధంగా ఏలాంటి మందులు ఉంచరాదని అన్నారు.రాష్ట్రంలోని తెలంగాణ ప్రభుత్వం క్వాలిటి మందులు మాత్రమే అందించాలని లక్ష్యంగా పెట్టుకుందని అన్నారు. కార్యక్రమంలో మెడికల్ షాపుల యాజమానులు శ్రీనివాస్‌గుప్త, నాగరాజు, నాగరాజుగౌడ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.