రుచి

మెంతికూర వంటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరన్, విటమిన్-ఎతో పాటు మంచి పోషకాలు ఉన్నందున తరచూ మెంతికూరను వంటల్లో వాడితే నేత్రసంబంధ సమస్యలు, చర్మవ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చు.మధుమేహ వ్యాధిగ్రస్తులు, నరాల జబ్బులున్నవారు దీన్ని తీసుకుంటే మంచి ఫలితంకనిపిస్తుందని వైద్యులు చెబుతుంటారు. మెంతికూరతో పప్పు, పరోటాలు, పచ్చడి, వడలు, పులుసు, పలురకాల కూరలు వండవచ్చు. వంటల్లో విరివిగా దీన్ని వాడితే శారీరక ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.

వడలు
మెంతికూర - 8 కప్పులు
శెనగపప్పు - 2 కప్పులు
అల్లం,వెల్లుల్లి పేస్టు - 5 చెంచాలు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
జీడిపప్పు - 24
ఉప్పు - 2 చెంచాలు
పచ్చిమిర్చి - 12
నూనె - 250 గ్రా.
బొబ్బర్ల పప్పు - 100 గ్రా.
మినప్పప్పు - 100 గ్రా.
కొబ్బరి కోరు - 4 చెంచాలు
బియ్యప్పిండి - 1/2 కప్పు
ముందుగా శెనగపప్పు, మినప్పప్పు, బొబ్బర్ల పప్పు నానబెట్టాలి. నీటిని బయటకు తీసేసి ఈ పప్పులను పిండిగా రుబ్బుకోవాలి. ఈ ముద్దలో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్టు కలిపి మరొకసారి రుబ్బాలి. ఆ తర్వాత జీడిపప్పు ముక్కలు వేసి వడలుగా తట్టి మధ్యలో చిల్లుపెట్టి కాగిన నూనెలో దోరగా వేపాలి.

పరోటాలు
మెంతికూర - 5 కప్పులు
గోధుమ పిండి - 2 కప్పులు
జీలకఱ్ఱ - 2 చెంచాలు
పచ్చిమిర్చి రసం - 1/2 కప్పు
ఉప్పు - 2 చెంచాలు
కొబ్బరి కోరు - 2 చెంచాలు
నూనె - 1/2 కప్పు
నెయ్యి - 1/4 కప్పు

గోధుమ పిండిలో కాచిన నెయ్యి, తరిగిన మెంతికూర, జీలకఱ్ఱ, పచ్చిమిర్చి రసం, ఉప్పు కలిపి, ఈ ముద్దను ఉండలుగా చేసుకోవాలి. వీటిని పూరీల్లా వత్తాలి. వీటిని రెండుసార్లు మడత పెట్టి త్రికోణం ఆకారంలో చేసుకుని నూనె వేసిన పెనంపై కాల్చుకోవాలి. రెండు వైపులా కాలిస్తే పరోటాలు పొరలు పొరలుగా వస్తాయి. వీటిని బంగాళాదుంపల కుర్మాతో తింటే రుచికరంగా ఉంటాయి.

పచ్చడి
మెంతికూర - 8 కప్పులు
శెనగపప్పు - 1/4 కప్పు
మినప్పప్పు - 1/4 కప్పు
పచ్చిమిర్చి - 11
ఎండుమిర్చి - 12
నూనె - 1/2 కప్పు
వెల్లుల్లి - పది
ఉప్పు - 2 చెంచాలు
జీలకఱ్ఱ - 4 చెంచాలు
ఆవాలు - 4 చెంచాలు
చింతపండు రసం - 1/2 కప్పు
నువ్వుల పొడి- 1/2 కప్పు
ముందుగా బాణలిలో పోపులు వేయించి, ఆ తర్వాత మెంతి ఆకులు వేసి మగ్గనివ్వాలి. చల్లారాక పోపులు, మెంతి ఆకులను మిక్సీ పట్టాలి. తర్వాత ఈ ముద్దలో చింతపండు రసం, నువ్వుల పొడి, వెల్లుల్లి రెబ్బలు వేసి దగ్గరగా మరగనివ్వాలి. ఈ పచ్చడి అన్నం, ఇడ్లీల్లోకి రుచిగా ఉంటుంది.

పులుసు
చింతపండు రసం - 2 కప్పులు
ఇంగువ - చిన్న ముక్క
మెంతులు - 1/2 చెంచా
కొబ్బరి కోరు - 2 చెంచాలు
బెల్లం, ఆవాలు - 2 చెంచాలు
జీలకఱ్ఱ - 1 చెంచా
పచ్చిమిర్చి - 6, ఎండుమిర్చి - 4
నెయ్యి - 2 చెంచాలు
శెనగపిండి - 5 చెంచాలు
నేతిలో పోపులు వేయించాక మిక్సీ పట్టాలి. శెనగపిండిలో నీరు కలిపి పలుచగా చెయ్యాలి. బాణలిలో నూనె వేడిచేసి మెంతికూర, ఉప్పు వేసి మగ్గించాలి. మెంతి ఆకులు మెత్తగా అవుతుండగా శెనగపిండి కలిపిన నీరు, చింతపండు రసం కలపాలి. ఇది మరుగుతుండగా బెల్లం, పోపుల పొడి వేయాలి. కాస్త చిక్కగా చేసుకుంటే ఈ వంటకం అన్నం, దోశల్లోకి బాగుంటుంది.

పప్పు
మెంతికూర - 4 కప్పులు
పెసరపప్పు - 2 కప్పులు
నిమ్మరసం - 1/2 కప్పు
కొత్తిమీర - కొంచెం
నూనె - 1/4 కప్పు
ఉప్పు - 2 చెంచాలు
ఆవాలు - 2 చెంచాలు
జీలకఱ్ఱ - 1 చెంచా
పచ్చిమిర్చి - 6
కొబ్బరి కోరు - 5 చెంచాలు
ఇంగువ - కాస్త
ముందుగా పెసరపప్పును బాగా ఉడికించి పక్కన పెట్టాలి. తర్వాత బాణలిలో పోపులు వేయించి, తర్వాత అందులో కొబ్బరి కోరు, మెంతి ఆకులు, ఉప్పు వేసి మూత పెట్టాలి. బాగా మగ్గాక కిందకి దింపి, ఉడికిన పెసరపప్పు కలిపి కొత్తిమీర జల్లి చల్లారాక నిమ్మరసం కలపాలి.

-చంద్రిక