జాతీయ వార్తలు

కార్యకర్తల ఆదేశాలే నాకు ముఖ్యం:మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి: బీజేపీ కార్యకర్తల ఆదేశాలే తనకు ముఖ్యమని ప్రధాని మోదీ అన్నారు. తనను గెలిపించిన వారణాసికి వచ్చిన ఆయన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. ఏప్రిల్ 25న కాశీకి వచ్చినపుడు మీరు నెల రోజుల వరకు ఇక్కడకు రావద్దని చెప్పారని, అందుకే కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తూ ఎన్నికలు అయిపోయిన వెంటనే కేదార్‌నాథ్ వెళ్లానని అన్నారు. తాను ఈ దేశానికి ప్రధాని కావచ్చు. కాని మీకు ఎంపీని, సేవకుడిని, కార్యకర్తని అన్నారు. నాకు వారణాసి ప్రజలపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. బెంగాల్, త్రిపురలలో బీజేపీ కార్యకర్తలను హతమార్చారని అన్నారు. కాశీ శక్తిని.. శాంతిని ఇస్తుందని అన్నారు.