జాతీయ వార్తలు

ప్రధాని మోదీతో కాశ్మీర్ విపక్ష నేతల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: కాశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్రానికి చెందిన విపక్ష నేతలు సోమవారం ఉదయం ఇక్కడ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. కాశ్మీర్ మాజీ సిఎం ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలో విపక్ష పార్టీల నాయకులు మోదీని కలిశారు. శాంతి భద్రతల సమస్య కారణంగా కాశ్మీర్‌లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారని వారు వివరించారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు వెంటనే వివిధ వర్గాల నేతలతో చర్చలు ప్రారంభించాలని లేని పక్షంలో శాంతి భద్రతలు మరింతగా క్షీణించే ప్రమాదం ఉందని వారు వివరించారు. ఆందోళనకారులపై పెల్లెట్ తుపాకుల వినియోగాన్ని నిషేధిస్తూ భద్రతా దళాలకు ఆదేశాలివ్వాలని విపక్ష నేతలు మోదీకి విజ్ఞప్తి చేశారు.