జాతీయ వార్తలు

ఆధార్‌కు డ్రైవింగ్ లైసెన్స్‌లతో లింకు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: ఆధార్ కార్డును వాహన రిజిస్ట్రేషన్ కోసం తప్పనిసరి చేయడం మంచిదేకాని, డ్రైవింగ్ లైసెన్స్‌కు తప్పనిసరి చేయటం సమర్థనీయం కాదని వైకాపా ఎంపీ వి వరప్రసాదరావు స్పష్టం చేశారు. ప్రసాదరావు శుక్రవారం లోక్‌సభలో వాహన చట్టం సవరణ బిల్లుపై మాట్లాడుతూ వాహన చట్టానికి ప్రతిపాదించిన కొన్ని సవరణలు విప్లవాత్మకమైనవేనని అన్నారు. అయితే ఆధార్ ఉంటేనే డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తామని చెప్పడం సరైందికాదని తెలిపారు. ‘దేశంలో కోట్లాది మంది నిరక్ష్యరాస్యులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి’అని ఆయన పేర్కొన్నారు. ఆటోమెటిక్ ఇన్స్‌పెక్షన్‌తో అవినీతి బాగా తగ్గుతుందని వరప్రసాదరావు అన్నారు. నకిలీ డ్రైవింగ్ లైసెన్సులను తొలగించవలసిందేనని, అయితే అత్యంత జాగరూకతతో చేయవలసి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
తాగి వాహనాన్ని నడపటం, చిన్న పిల్లలు నడపటం వంటి వాటిని అదుపుచేసేందుకు కఠిన చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందని ఎంపీ చెప్పారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే తప్ప తాగి వాహనాన్ని నడిపే అలవాటు పోదన్నారు. చిన్న పిల్లలు వాహనాలు నడిపించటం తగ్గాలన్నా కఠిన చర్యలు అవసరమన్నారు. ఆధునిక పద్ధతులు, రిమోట్ సెన్సింగ్ ద్వారా ఇలాంటి నేరాలను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. థర్డ్ పార్టీ బీమాలో కారు ప్రమాదంలో మరణిస్తే పది లక్షలు, గాయపడితే ఐదు లక్షలు మాత్రమే ఇవ్వాలనే పరిమితి మంచిది కాదన్నారు. బీమా సంస్థలు ఈ నిబంధనను దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని వరప్రసాదరావు హెచ్చరించారు.