జాతీయ వార్తలు

స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులు టాప్ టెన్‌లో వైజాగ్, తిరుపతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రేటర్ హైదరాబాద్‌కు 22వ ర్యాంక్ తొలి రెండు స్థానాల్లో ఇండోర్, భోపాల్

న్యూఢిల్లీ, మే 4: దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాలకు ర్యాంకులు, అవార్డుల పంట పండింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే-2017లో విశాఖపట్నానికి 3వ ర్యాంకు, తిరుపతికి 9వ ర్యాంకు, విజయవాడకు 19వ ర్యాంకు, హైదరాబాద్ (జిహెచ్‌ఎమ్‌సి)కి 22వ ర్యాంకు లభించింది. అలాగే వరంగల్‌కు 28, సూర్యాపేటకు 30, తాడిపత్రికి 31, నరసరావుపేటకు 41, కాకినాడకు 43, తెనాలికి 44, సిద్దిపేటకు 45, రాజమహేంద్రవరానికి 46 ర్యాంకులు టాప్ 50లో దక్కించుకున్నాయి. ఈ ర్యాంకులలో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు మొదటి స్థానం లభించగా, భోపాల్ రెండో స్థానం దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఆయా నగరాలలో ఉండే వౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, బహిరంగంగా మల మూత్ర విసర్జన నిర్మూలన, ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం, రవాణ వ్యవస్థ, చెత్తశుద్ధి నిర్వహణ వంటి అంశాలు పరిగణనలోకి తీసుకొని ఈ ర్యాంకులు వెల్లడించారు. గురువారంనాడు స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు విడుదల చేశారు.
దేశ వ్యాప్తంగా మొత్తం 434 నగరాల్లో, చిన్న చిన్న పట్టణాలకు సంబంధించిన ర్యాంకులను ఆయన ప్రకటించి, అవార్డులను ప్రదానం చేశారు. దేశవ్యాప్తంగా పురస్కారాల విభాగంలో జాతీయ స్థాయిలో ఏపీ రెండు అవార్డులు దక్కించుకోగా, సౌత్ జోన్ విభాగంలో 27 నగరాలకు అవార్డుల లభించగా ఏపీ నుంచి నాలుగు పట్టణాలకు అవార్డులు దక్కాయి. అలాగే తెలంగాణ నుంచి సౌత్ జోన్ విభాగంలో సూర్యాపేటకు అవార్డు లభించింది. దేశంలో మూడవ పరిశుభ్ర నగరంగా విశాఖ నిలవగా ఆ అవార్డును రాష్ట్ర స్వచ్ఛాంధ్ర కమిషనర్ మురళీధర్‌రెడ్డి, విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, కమిషనర్ హరినారాయణ్ అందుకున్నారు. జాతీయ స్థాయిలో పరిశుభ్రమైన నగరం (రెండు నుంచి పది లక్షల జనాభా) విభాగంలో ఏడవస్థానం తిరుపతి నగరం దక్కించుకోగా, ఆ పురస్కారాన్ని గతంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన వినయ్ చంద్ స్వీకరించారు.
సౌత్ జోన్‌లో 10 లక్షల జనాభా వున్న పరిశుభ్ర నగరాల విభాగంలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 8వ స్థానం దక్కించుకోగా, గతంలో కార్పొరేషన్ కమిషనర్‌గా పనిచేసిన, ప్రస్తుతం అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న వీరపాండ్యన్ అవార్డును అందుకున్నారు. అదే విభాగంలో తొమ్మిదవ స్థానం కాకినాడ దక్కించుకోగా, ఆ పురస్కారాన్ని కమిషనర్ షేక్ అలీం భాషా అందుకున్నారు. అలాగే సౌత్ జోన్ లోని రెండు నుంచి 10 లక్షల జనాభా వుండి వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో పరిశుభ్రత పాటిస్తున్న నగరంగా ఒంగోలు 10వ స్థానం దక్కించుకోగా ఆ జిల్లా కలెక్టర్ వినయ్ చంద్, కమిషనర్ వెంకటకృష్ణ అవార్డును అందుకున్నారు. సౌత్‌జోన్‌లో రెండు లక్షల జనాభా కలిగివుండి పరిశుభ్రత పాటిస్తున్న నగరంగా తెలంగాణలోని సూర్యాపేట 11వ స్థానంలో నిలవగా, ఆ అవార్డును మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళిక అందుకున్నారు. అలాగే సౌత్‌జోన్‌లోని రెండు లక్షల జనాభా వుండి వేగంగా అభివృద్ధి చెందుతూ పరిశుభ్రత పాటిస్తున్న నగరంగా తాడిపత్రి స్థానం దక్కించుకోగా మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ బి.ఎండి. జీలన్ అవార్టు అందుకున్నారు. తెలంగాణ నుంచి 12 నగరాలలో సర్వే నిర్వహించగా హైదరాబాద్ (జిహెచ్‌ఎంసి) 22వ స్థానం దక్కించుకోగా, మహబూబ్‌నగర్ 249వ స్థానంలో నిలిచి తెలంగాణలో చివరి స్థానంలో నిలిచింది. టాప్ 50 జాబితాలో ఆంధ్రప్రదేశ్‌నుంచి 8, తెలంగాణనుంచి నాలుగు పట్టణాలకు చోటు లభించింది.

చిత్రం... స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డును అందుకుంటున్న
విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, కమిషనర్ హరినారాయణ్