జాతీయ వార్తలు

సభలో ఆగని రభస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: ఆంధ్రప్రదేశ్ విభజన హామీల అమలుకోరుతూ పార్లమెంట్‌లో రాష్ట్ర ఎంపీలు వరుసగా నాలుగోరోజూ నిరసన కొనసాగించారు. శుక్రవారం తెదేపా, వైకాపా, కాంగ్రెస్ ఎంపీలు వివిధ రూపాల్లో పార్లమెంట్ లోపల, బయటా ఆందోళన కొనసాగించారు. విభజన హామీల అమలు, కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయంపై పార్లమెంట్ ఆవరణలో తెదేపా ఎంపీలు నిరసన కొనసాగించారు. ముందుగా పార్లమెంట్ అవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆ పార్టీ ఎంపీలు ప్లకార్డులు చేత పట్టుకోని నిరసన తెలిపారు. అయితే వినూత్న వేషధారణలో ఎంపీ శివప్రసాద్ పార్లమెంట్‌లో నిరసన తెలిపారు. ఎంపీ శివప్రసాద్ పోతురాజు వేషధారణలో కింద కూర్చుని నిరసన తెలుపే సమయంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రజలను మోసం చేయడమే కాకుండా తిరుపతి వెంకటేశ్వర స్వామిని, బెజవాడ కనకదుర్గమ్మనూ మోసం చేశారంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఇచ్చిన హామీలన్నింటినీ ఇప్పడు మర్చిపోయారా? అని ప్రశ్నించారు. తిరుపతి వెంకన్నను మోసం చేస్తే ఇబ్బందులు తప్పవని ప్రధానిని పరోక్షంగా శివప్రసాద్ హెచ్చరించారు. మరోవైపు వైకాపా ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి,అవినాశ్‌రెడ్డి, వరప్రసాద్‌లు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద నిలబడి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
ఎంపీలపై వెంకయ్య ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు చేయాలని, బడ్జెట్‌లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిచేయాలంటూ రాష్ట్రానికి చెందిన ఎంపీల నిరసనలతో శుక్రవారం వరసగా రాజ్యసభ రెండుసార్లు వాయిదాపడింది.
రాష్ట్రానికి చెందిన తెదేపా ఎంపీలు సిఎం రమేష్, గరికపాటి రామ్మోహన్‌రావు, టీజీ వెంకటేష్, తోట సీతారామలక్ష్మి, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిలు రాజ్యసభలో తమ నిరసనలను వరసగా నాలుగోరోజూ కొనసాగించారు. ముందుగా శుక్రవారం రాజ్యసభ ప్రారంభం కాగానే వివిధ మంత్రిత్వ శాఖల, వివిధ కమిటీల నివేదికలను సభకు సమర్పించిన అనంతరం సభ్యులు జీరో అవర్‌ను కొనసాగించాలని చైర్మన్ వెంకయ్యనాయుడిని కోరారు. ఈ పరిస్థితులో రాష్ట్రానికి చెందిన ఎంపీలు సిఎం రమేష్, తోట సీతారామలక్ష్మి, టీజీ వెంకటేష్, కేవీపీలు పోడియం వద్దకొచ్చి ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేస్తూ ప్లకార్డులను ప్రదర్శంచారు. పోడియం వద్దకొచ్చి ఆందోళనకు దిగడం సరైన విధానం కాదంటూ చైర్మన్ వెంకయ్య ఏపీ ఎంపీలను హెచ్చరించారు. అదే సమయంలో ప్రధాని నరేంద్రమోదీ రాజ్యసభలో ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరిపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించటంతో ఒక్కసారిగా సభలో గందరగోళం తలెత్తింది. ఇలా అయితే సభను నడిపించటం కష్టమని, వాయిదా వేయాల్సి ఉంటుందని హెచ్చారిస్తూ సభను గంటపాటు వాయిదా వేసి వెళ్లిపోయారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభం కాగానే యథాతథంగానే ఏపీ ఎంపీలు పోడియం వద్ద నిరసన కొనసాగించారు. చైర్మన్ వెంకయ్యనాయుడు ఎన్నిసార్లు హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో, మరోసారి సభను మధ్యాహ్నం 2.30కు వాయిదావేసి వెళ్లిపోయారు. మధ్యాహ్నం ప్రారంభమైన సభలోనూ తెదేపా ఎంపీలు నిరసనకు దిగి సాయంత్రం వరకూ కొనసాగించారు. తెదేపా ఎంపీలు పట్టినపట్టు విడవకుండా నిరసన కొనసాగించటంతో, వాళ్లకు సిపిఐ ఎంపీ డి రాజా,కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద్ భాస్కర్‌లు సంఘీభావం తెలిపారు. ఏపీకి విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
chitram...
లోక్‌సభలో పోడియం వద్ద నిరసన తెలుపుతున్న ఆంధ్రప్రదేశ్ ఎంపీలు