జాతీయ వార్తలు

మీ హితుడిని, స్నేహితుడిని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: తనను ప్రధానిగా కాకుండా హితుడిగా, సన్నిహితుడిగా భావించాలని ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులకు ఉద్భోధించారు. శుక్రవారం ఇక్కడ తల్కతోరా స్టేడియంలో జరిగిన పరీక్షా పే చర్చా కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది పిల్లలు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. మరికొన్ని రోజుల్లో టెన్త్, ఇంటర్ పరీక్షలు జరగనున్న దృష్ట్యా పిల్లల్లో ఏకాగ్రత, నిబద్ధత వంటి అంశాలను బలంగా పాదుగొల్పే విధంగా మోదీ ఈ ప్రశ్నలకు జవాబిచ్చారు. పరీక్షల సమయంలో వత్తిళ్లను ఏవిధంగా అధిగమించాలి, ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలంతూ తల్లిదండ్రుల నుంచి వచ్చే వత్తిడిని ఏవిధంగా తట్టుకోవాలి, యోగావల్ల వీటినుంచి బయటపడే అవకాశం ఉందా? అలాగే పోటీ వాతావరణాన్ని తొట్రుపాటు లేకుండా ఎలా అధిగమించాలి? అన్న దానిపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు మోదీ వివరణాత్మక జవాబిచ్చారు. ‘ఈరోజు నేను ఓ విద్యార్థిని. మీరు నాకు పరీక్ష పెట్టేవాళ్లు. నాకెన్ని మార్కులు వస్తాయన్నది మీరు తరువాత నిర్ణయించండి. నన్ను ప్రధానిగా భావించకండి. మీ శ్రేయస్సుకోరే హితుడిగా పరిగణించండి’ అన్నారు. ఈ స్డేడియంకు హాజరైన విద్యార్థులు, అదేవిధంగా దేశవ్యాప్తంగా పీఎంవోకు ప్రశ్నలు పంపించిన వారిని ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య వత్తిడి. ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలన్న ఆరాటంలో మానసికంగా అలజడికి లోనవుతుంటారు. ఈ ప్రశే్న చాలా ఎక్కువమంది పిల్లలు వేయడంతో, దీనిపైనే మాట్లాడిన మోదీ ‘మనమంతా కూడా మంచి మార్కులు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే చదువుతాం. నిజాయితీగా ఏకాగ్రతతో పాఠ్యాంశాలను అవగతం చేసుకోవడానికి కృషి చేస్తాం. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మ విశ్వాసాన్ని వీడకూడదు. దీనివల్ల చివరి క్షణంలో చదివింది కూడా మర్చిపోయే అవకాశం ఉంటుంది’ అని మోదీ తెలిపారు. మన ముందున్న సవాళ్లను ఎలా ఎదుర్కొవాలన్న దానిపై ప్రధానంగా దృష్టి పెట్టడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుందని, దీనివల్ల మరింత కష్టపడి చదవాలన్న పట్టుదలా ఇనుమడిస్తుందని అన్నారు. చదివింది చాలు అన్న ఆత్మ సంతృప్తికి లోనుకాకుండా మరింతగా చదవాలి, మరింతగా నేర్చుకోవాలి, మరిన్ని మార్కులు సాధించాలన్న అంశంపైనే విద్యార్థులు దృష్టి పెట్టాలని ఉద్ఘాటించారు. ఏకాగ్రత అన్నది నేర్చుకుంటే వస్తుందన్నది పొరబాటని పేర్కొన్న మోదీ, మన పట్టుదల, క్రమశిక్షణ వల్లే ఏకాగ్రత పెరుగుతుందని, మన ప్రయత్నం లేకుండా ఈ ఏకాగ్రత లభిస్తుందన్నది వట్టి మాట అని మోదీ తెలిపారు. మన కృషి, ప్రయత్న ఫలితంగానే ఏదైనా సిద్ధిస్తుందన్న వాస్తవాన్ని ఎట్టిపరిస్థితుల్లో విడనాడకూడదని పేర్కొన్న మోదీ, పూర్తిస్థాయి ఏకాగ్రతను పెంపొందించుకునే అంశాలపట్ల విద్యార్థిలోకం దృష్టిపెట్టాలన్నారు.
chitram...
పరీక్షా పే చర్చాలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతున్న ప్రధాని నరేంద్ర మోదీ