జాతీయ వార్తలు

రాజధానా? మయసభా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ టీడీపీ, వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణలు బీజేపీ నేతలు తోసిపుచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ కంభంపాటి హరిబాబు, పార్టీ అధికార ప్రతినిధి నరసింహరావుశుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీ ఈ విషయంలో ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నాయని విమర్శించారు. ప్రత్యేక హోదా పేరుతో ఎవరు రాజీనామాలు చేసినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఇద్దరు నేతలూ హితవుచెప్పారు. కాంగ్రెస్ ఆంధ్రుల గొంతు కోస్తే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తోందని వారు స్పష్టం చేశారు. అలాంటిది తమనే విమర్శిస్తారా? అని నరసింహారావు, హరిబాబు ప్రశ్నించారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం గురించి మాట్లాడుతూ ‘వీరు రాజధానిని నిర్మిస్తున్నారా? మయసభను నిర్మిస్తున్నారా?’ అంటూ టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ‘కొత్త రాజధానిలో ప్రభుత్వ భవనాలు నిర్మించటం కేంద్ర ప్రభుత్వం బాధ్యత. దీని కోసం రెండున్నర వేల కోట్లు ఇది వరకే ఇచ్చారు. మరో వెయ్యి కోట్లు ఇవ్వవచ్చు’అని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇంత వరకు ఇచ్చిన సంస్థలు, విడుదల చేసిన నిధులపై వారు 18 పేజీల పత్రాన్ని విడుదలు చేశారు. ప్రత్యేక హోదా సాకుగా చూపించి కేంద్రం ఎంత ఇచ్చినా పట్టించుకోకుండా సమస్యను పక్కదారి పట్టిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రత్యేక హోదా ట్యాగ్ ఉంటే చాలు అనే విధంగా తెలుగుదేశం వ్యవహరిస్తోందని వారు దుయ్యబట్టారు. తమకు ప్రత్యేక హోదా చాలు, మిగతావి ఏవీ అవసరం లేదని తెలుగుదేశం పార్టీని చెప్పమనండి అంటూ నరసింహరావుమండిపడ్డారు. విభజన చట్టంలోలేని పలు ప్రాజెక్టులను కేంద్రం ఇచ్చినా ప్రత్యేక హోదా అంటూ నానా యాగీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ తమ తప్పులను కప్పిపుచ్చుకుంటూ హోదా డ్రామాలు ఆడుతోందని కంభంపాటి విరుచుకుపడ్డారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి రావలసినదంతా ప్రత్యేక సహాయం, ప్యాకేజీ రూపంలో కేంద్రం అందజేస్తోందని బీజేపీ నేతలు తెలిపారు. ప్రత్యేక హోదా పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఇరువురు నాయకులు దుయ్యబట్టారు. ఏడు జిల్లాలకు 30 సెప్టెంబర్ 2016లో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సేషన్ నోటిఫికేషన్ ద్వారా పన్ను రాయితీ కల్పించలేదా? అని వారు ప్రశ్నించారు. తెలుగుదేశం, వైకాపా దీనికి జవాబు ఇవ్వగలవా అని రావునిలదీశారు. పన్ను రాయితీలు వచ్చిన జిల్లాలకు ఈ రెండు పార్టీల ఎంపీలు, ఎంఎల్‌ఏలు ఏ స్థాయిలో పెట్టుబడులు తీసుకురాగలిగారని వారు అడిగారు. ఏడు జిల్లాకు ఇచ్చిన పన్ను రాయితీని వాడుకోవడంలో విఫలమైన వారు కేంద్రాన్ని ప్రశ్నించటం ఏమిటని వారు ఎద్దేవా చేశారు. ‘ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు ఏ రాష్ట్రానికి కూడా సంజీవినిలా పని చేయవు. అన్ని సమస్యలను ఇవి పరిష్కరించవు. హోదా వస్తే మనమిక పని చేయవలసిన అవసరం లేదనుకోవటం మూర్ఖత్వం అవుతుంది’అని వారు అభిప్రాయపడ్డారు. ఎంపీలు, ఎంఎల్‌ఏలు తమ బాధ్యతను గుర్తెరిగి పని చేయాలి తప్ప కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేసినంత మాత్రాన ఫలితం ఉండదని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వారు కేంద్రం నుంచి వచ్చినదంతా హైదరాబాద్‌లో పెట్టి మిగతా ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని, ఈ విషయంలో టీడీపీ, కాంగ్రెస్ తక్కువేమీ కాదని వారు విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న వారు చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే ఏపీకి ఈ గతి పట్టేదికాదని వారన్నారు. ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గతంలో మేమే వాదించాం. ఇప్పుడు అది సాధ్యం కావటం లేదు కాబట్టే ప్రత్యేక ఆర్థిక సహాయం చేస్తున్నాం’అని ఏపీ బీజేపీ నేతలు పేర్కొన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు రాజకీయ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది, కేంద్రం ఈ విషయంలో రాజకీయ నిర్ణయం తీసుకుంటుందని హరిబాబు చెప్పారు. దుగ్గిరాజపట్నం పోర్టు, కడప ఉక్కు కార్మాగారం ఏర్పాటు సాధ్యం కాదని నివేదికలు వచ్చినా కేంద్రం వాటి స్థాపనకు కృషి చేస్తోందని హరిబాబు తెలిపారు.