జాతీయ వార్తలు

నేడు భారత్‌కు ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జనవరి 23: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాన్ భారత్‌లో జరుపనున్న మూడు రోజుల పర్యటన ఆదివారం ప్రారంభం కానుంది. ‘సుందర నగరం’ చండీగఢ్ నుంచి ఈ పర్యటన ప్రారంభమవుతుంది. చండీగఢ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో కలసి వాణిజ్య సమావేశంలో పాల్గొననున్న హోలాన్ వివిధ ముఖ్య ప్రదేశాలను సందర్శించనున్నారు. ఇరు దేశాల అధినేతలు పలువురు కార్పొరేట్ దిగ్గజాలతో కలసి భారత్-ఫ్రాన్స్ వాణిజ్య శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననుండటంతో చండీగఢ్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. లీ కోర్బసియర్‌గా చిరపరిచితుడైన స్విస్-ఫ్రెంచ్ ఆర్కిటెక్టు చార్లెస్ ఎడ్వర్డ్ జీనె్నరెట్-గ్రిస్ 1950, 60 దశకాల్లో చండీగఢ్ నగరాన్ని డిజైన్ చేసిన విషయం తెలిసిందే. ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో కలసివస్తున్న హోలాన్ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు చండీగఢ్‌కు చేరుకోనున్నారు. అనంతరం ఆయన మోదీతో కలసి చండీగఢ్‌లో రాక్ గార్డెన్, కాపిటల్ కాంప్లెక్స్, ప్రభుత్వ మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ వంటి ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. 15 నిమిషాల పాటు ఆ ప్రాంతాలను సందర్శిస్తారని అధికారులు వెల్లడించారు.