జాతీయ వార్తలు

మ్యాథ్స్ ఒలింపియాడ్‌లో గుజరాత్ బాలుడి విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: గుజరాత్ రాజధాని అహ్మదాబాద్‌కు చెందిన 14 ఏళ్ల తుషార్ తలావత్ అంతర్జాతీయ గణిత శాస్త్ర పోటీలో విజయం సాధించి అందరి దృష్టినీ ఆకర్షించాడు. హేమచంద్రాచార్య సంస్కృత పాఠశాలలో చదువుతున్న తుషార్ ఇటీవల ఇండోనేసియాలో నిర్వహించిన ఇంటర్నేషనల్ మ్యాథెమెటిక్స్ కాంపిటీషన్‌లో నెగ్గడం ద్వారా తాను చదువుతున్న ‘గురుకులానికి’ కీర్తి ప్రతిష్ఠలను తీసుకొచ్చారు. అబాకస్ లర్నింగ్ ఆఫ్ హయ్యర్ అరిథ్‌మెటిక్ (అలోహ) ఇంటర్నేషనల్ సంస్థ ఇండోనేసియాలోని యోగ్యకర్తలో ఈ నెల 24న నిర్వహించిన ఈ పోటీలో 18 దేశాల నుంచి 1,300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. తుషార్ సాధించిన విజయం దేశానికి గర్వకారణమే కాకుండా గురుకుల విద్యావ్యవస్థ పట్ల అందరి దృష్టినీ ఆకర్షింపచేసిందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అనుబంధ భారతీయ శిక్షణ మండల్ (బిఎస్‌ఎం) సంయుక్త కార్యనిర్వాహక కార్యదర్శి ముకుల్ కనిట్కర్ అన్నారు.

శ్లాబ్ కూలి 13మంది మృతి
పుణె, జూలై 29: పుణెలోని బలెవాడి ప్రాంతంలో శుక్రవారం నిర్మాణంలో ఉన్న ఒక భవనం పైకప్పు కూలి తొమ్మిది మంది కార్మికులు మృతిచెందారు. నిర్మాణంలో ఉన్న ఈ భవనం 13వ అంతస్తులో కార్మికులు పనిచేస్తుండగా సిమెంట్ పైకప్పు కూలిపోయిందని డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ (జోన్-3) బి.తెలి చెప్పారు. సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

శాన్‌డిగోలో కాల్పులు
ఒక పోలీసు మృతి

శాన్‌డిగో, జూలై 29: శాన్‌డిగో పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఒక పోలీసు అధికారి మృతి చెందగా, మరో పోలీసు అధికారి తీవ్రంగా గాయపడ్డారు. గురువారం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుందని అధికారులు శుక్రవారం తెలిపారు. కాల్పులకు తెగబడిన అనుమానితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, ఇళ్ల తలుపులు మూసుకొని ఉండాలని సూచించారు.