నల్గొండ

కాంగ్రెస్‌ను వీడను.. అధికారమే లక్ష్యంగా కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నార్కట్‌పల్లి, జూన్ 9: తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అయితే తెచ్చింది సాధించింది కెసిఆర్ అన్నట్లుగా ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెప్పుకుంటూ ఎన్నికల హామీలను విస్మరిస్తున్నారని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి టిఆర్‌ఎస్‌పై విమర్శలు కురిపించారు. గురువారం నార్కట్‌పల్లి మండల కేంద్రంలో విలేఖరులతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్‌ను వీడి టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా వస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవాలు లేవని మరోసారి స్పష్టం చేశారు. తనకు రాజకీయ భవిష్యత్తునిచ్చింది కాంగ్రెస్‌నేనని, అలాంటి పార్టీ అభివృద్ధికోసం వచ్చే ఎన్నికల్లో అధికారం కోసం నిరంతరం ప్రజల మధ్య ఉండి పోరాడుతానని పేర్కొన్నారు. నల్లగొండ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని, సిఎం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం కాకుండా చూసేందుకే కాంగ్రెస్‌లో ఉన్న లోపాలను బాధ్యతగల కార్యకర్తగా ఎత్తి చూపానుతప్ప, తన విమర్శల్లో ఎలాంటి స్వార్థం లేదన్నారు. రాష్ట్ర స్థాయిలో కోమటిరెడ్డికి గుర్తింపు తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, ఆ పార్టీ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేసి క్రమశిక్షణ గల కార్యకర్తగా పని చేస్తానన్నాను, జిల్లాలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజాప్రతినిధులు తనపై నమ్మకముంచుకుని తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఓటు వేశారని, అలాంటి విశ్వనీయతను మర్చిపోనన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేని కొంత మంది పార్టీ మారుతున్నట్లుగా అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రజలు దీనిని గమనిస్తున్నారన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో జడ్పీటీసి సత్తయ్యయాదవ్, కాంగ్రెస్ నాయకులు సైదులుయాదవ్, ఎంపిటీసి ఐతరాజు యాదయ్య, రేకల రాజిరెడ్డి పాల్గొన్నారు.
హరినాథ్ కుటుంబానికి పరామర్శ
మంగళవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హరినాథ్ కుటుంబాన్ని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి పరామర్శించారు. ప్రమాదానికి సంబందించిన కారణాలను అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. హరినాథ్ యువ పారిశ్రామికవేత్త అని, క్రమశిక్షణతో ఉన్నతశిఖరాలను అధిరోహించిన యువకుడిని జిల్లా కోల్పోవడం బాధాకరమన్నారు.
పదవుల కంటే ప్రజలే ముఖ్యం
తిప్పర్తి: కొన్ని రోజులుగా పార్టీ మారుతున్నానని తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవని, తనకు పదవుల కంటే ప్రజల అభివృద్ధే ముఖ్యమని సిఎల్‌పి నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలో మామిడాల గ్రామ పంచాయితీ పరిధిలోని యాపలగూడెంలో ఐదు లక్షల రూపాయలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మామిడాల గ్రామంలో పదిరోజుల క్రితం విద్యుత్‌షాకు గురై మృతి చెందిన వంగూరి నిర్మల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. తక్షణ సాయం కింద పదివేల రూపాయలు అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొరం మార్గం పూర్తి చేయించి రైతులకు సాగునీరందించే ఏర్పాటు చేస్తానన్నారు. అన్ని గ్రామాలలో సిసి రోడ్లు, బిటి రోడ్లు పూర్తి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణయ్య, ఎంపిటీసి పాదూరు నాగమణి శ్రీనివాస్‌రెడ్డి, జూకూరి రమేష్, ఆదిమూలం ప్రశాంత్, ముత్తిలింగం పాల్గొన్నారు.