జాతీయ వార్తలు

స్పీకర్, ఎమ్మెల్యేలకు సుప్రీం నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులపై శాసనసభ స్పీకర్‌కు, ఫిరాయింపులకు పాల్పడిన శాసనసభ్యులకు సుప్రీంకోర్టు నోటిసులు జారీ చేస్తూ మూడు వారాల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకునేలా స్పీకర్‌కు మార్గదర్శకాలు ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారంనాడు న్యాయమూర్తులు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ శివకిర్తిసింగ్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినవారిపై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదంటూ పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది వివేక్ తన్కా వాదనలు వినిపించారు. దీంతో ధర్మాసనం స్పీకర్‌కు, ప్రతివాదులకు నోటిసులు జారీ చేస్తూ మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నోటీసులను పిటిషనర్ వ్యక్తిగతంగా ప్రతివాదులకు అందజేస్తారు. సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన వారిని అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదంటూ గతంలో పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించాడని చెప్పారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు బెంచ్ తోసిపుచ్చిందని, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే సంపత్ కుమార్‌తోపాటు పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే ఎర్రబెల్లి ధయకర్‌రావుకూడా సుప్రీంకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు.