జాతీయ వార్తలు

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం/చింతూరు, ఆగస్టు 17: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా-దంతేవాడ సరిహద్దులో దండకారణ్యంలో బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమయ్యారు. కాగా ఏడుగురు జవాన్లకు కూడా గాయాలయ్యాయి. గాయపడ్డ జవాన్లను హెలీకాప్టర్ ద్వారా జగదల్‌పూర్‌కు తరలించి చికిత్సలు అందిస్తున్నారు. దంతెవాడ జిల్లా దబ్బాకున్నా అటవీప్రాంతంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. నలుగురు మావోయిస్టుల మృతదేహాలతో పాటుగా 303 సర్వీస్ రైఫిల్స్ 4, 12 బోర్ రైఫిల్స్‌తో పాటుగా 8 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాక్‌ప్యాక్ పిట్టులు 30 కూడా సంఘటనా స్థలంలో దొరికాయి. మృతుల్లో 26వ ప్లాటూన్ సీపీఐ మావోయిస్టు కమాండర్ మడకం దేవే, కటేకల్యాణ్ ఏరియా కమిటీ కమాండర్ మాసాల మృతదేహాలను ఇప్పటి వరకు గుర్తించారు. వీరిలో మాసా జీరంఘాట్‌లో సల్వాజుడుం వ్యవస్థాపక అధ్యక్షులు మహేంద్ర ఖర్మ హత్య కేసులో ప్రధాన నిందితుడు. 7గురు జవాన్లకు గాయాలవ్వగా వారిలో ఆదిత్యా కవర్ అనే జవాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో జగదల్‌పూర్‌లోని మహారాణి ఆసుపత్రిలో వైద్యులు ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణ సరిహద్దుల్లోని ఆంధ్రప్రదేశ్‌లోని విలీనం మండలం చింతూరుకు చెందిన పేగా గ్రామస్థులు కంగాల ముత్తయ్య, కంగాల నాగేశ్వరరావు, కణితి రామయ్య, సోడే ముద్దయ్యలను మావోయిస్టులు బుధవారం అపహరించుకు పోయారు. కానీ చింతూరు ఓఎస్‌డీ ఫకీరప్ప మాత్రం అపహరణ జరగలేదని, వారే మావోయిస్టులతో మాట్లాడేందుకు వెళ్లారనే సమాచారం మా వద్ద ఉందని ఖండించారు. దండకారణ్యంలోని కాంకేర్ జిల్లాలో అంతాగఢ్-తోడోకీ అటవీప్రాంతంలో మాన్‌కోట గుట్టల్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య గంట సేపు భీకరంగా కాల్పులు జరిగాయి. అయితే ఇరుపక్షాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. మావోయిస్టులు పారిపోగా సంఘటనా స్థలంలో భారీగా నక్సల్స్‌కు చెందిన నిత్యావసర వస్తువులు, ఆయుధాలు లభ్యమయ్యాయి.

చిత్రం.. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టులు