జాతీయ వార్తలు

సత్వర న్యాయం ఇప్పటికీ ఎండమావే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా, ఆగస్టు 20: న్యాయ వ్యవస్థలో ప్రస్తుతం జరుగుతున్న ఆధునీకరణ మారిన సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేదిగా ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ అంటూ, స్వచ్ఛమైన, సత్వరమైన న్యాయం ఇప్పటికీ ఎండమావిగానే ఉందన్నారు. మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభాల్లో ఒకటైన న్యాయ వ్యవస్థ కూడా అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంటోందని, మనం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో ఈ సవాళ్లు ఎన్నో కోణాలను సంతరించుకుంటున్నాయని, ఉన్న వాళ్లకు లేని వాళ్లకు మధ్య అంతరాన్ని పెంచేస్తున్నాయని ఆయన అన్నారు. సంపద కేవలం కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమై పోవడం వల్ల ప్రతి ఏటా నిరుపేదల సంఖ్య పెరిగిపోతోందని, స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా అందరికీ స్వచ్ఛమైన తాగునీరు, కనీస వౌలిక వైద్య సదుపాయాలు, విద్య, ఉపాధి లాంటివి అందించడం పెను సవాలుగా మారుతోందని, సంపద అంతా కొంతమంది చేతుల్లోనే కేంద్రీకృతం కాకుండా చూడడం ద్వారా పేదరికాన్ని పారదోలడం అనే క్లిష్టమైన సవాలును చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం ఎదుర్కొంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏళ్ల ప్రణాళికా బద్ధమైన అభివృద్ధి, సరళీకరణ, సంస్కరణల కారణంగా, భారత దేశం ప్రపంచంలో ఒక గుర్తింపును పొందగలిగిందని, 79 కోట్ల స్మార్ట్ఫోన్లు, 33.2 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు తయారయ్యారని, అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమేనని శనివారం ఇక్కడ హిమాచల్ ప్రదేశ్ యూనివర్శిటీ స్నాతకోత్సవంలో మాట్లాడుతూ ఠాకూర్ అన్నారు.