జాతీయ వార్తలు

ప్రశాంతంగా రెండో దశ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: పదిహేడవ లోక్‌సభ రెండోదశ ఎన్నికల్లో గురువారం 67శాతం పోలింగ్ నమోదైంది. పదకొండు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగాయి. పశ్చిమ బెంగాల్‌లో కొన్ని హింసాత్మక సంఘటనలు మినహా మిగతా ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. సీపీఎం నాయకుడు మహమ్మద్ సలీం, కాంగ్రెస్ నాయకురాలు దీపాదాస్ మున్షి, టీఎంసీ అభ్యర్థి కన్నయ్యలాల్ అగ్రవాల్ పోటీ చేసిన రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఎంసీ, బీజేపీ, సీపీఎం కార్యకర్తల మధ్య పెద్దఎత్తున గొడవ జరిగింది. టీఎంసీ కార్యకర్తలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించటంతో గొడవ ప్రారంభమైంది. ఈ గొడవల్లో సీపీఎం అభ్యర్థి సలీం కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. పలుచోట్ల ఈవీఎంలు పని చేయలేదు. దీంతో ఆయా కేంద్రాల్లో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైనట్లు కేంద్ర ఎన్నికల సంఘానికి సమాచారం అందింది. అసోంలోని ఐదు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 76.22శాతం పోలింగ్ నమోదైంది. బిహార్‌లో ఐదు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 62.04 శాతం పోలింగ్ జరిగింది. జమ్ముకాశ్మీర్‌లోని రెండు నియోజవర్గాల్లో 46శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ ప్రధాన మంత్రి దేవెగౌడ, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లికార్జున ఖర్గే, పలువురు కేంద్ర మంత్రులు పోటీ చేసిన కర్నాటకలోని 14 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన పోలింగ్‌లో 68 మంది ఓటర్లు ఓటు వేశారు. మహారాష్టల్రోని పది నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 51.50 శాతం పోలింగ్ జరిగింది. హోం శాఖ మాజీ మంత్రి సుశీల్‌కుమార్ రెడ్డి సోలాపూర్ నుండి పోటీ చేయటం తెలిసిందే. మణిపూర్‌లోని ఒక స్థానానికి జరిగిన ఎన్నికల్లో 78శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిశాలోని ఐదు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 58 శాతం పోలింగ్ జరిగింది. తమిళనాడులో 38 లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 69.64 శాతం ఓటింగ్ జరిగింది. ఇక్కడ వేలూరు లోక్‌సభ నియోజకర్గం ఎన్నికను వాయిదా వేయటం తెలిసిందే. కొందరు అభ్యర్థులు ఓటర్లకు డబ్బు పంచుతున్నారనీ, దీనివలన ఓటింగ్‌పై ప్రభావం పడుతుందనే అనుమానంతో కేంద్ర ఎన్నికల సంఘం వేలూరు ఎన్నికను వాయిదావేసింది. దేశంలోని అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లోని ఎనిమిది స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 62.06శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గురువారం పోలింగ్ జరిగిన ఎనిమిది స్థానాల్లోనూ 2014లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. పశ్చిమ బెంగాల్‌లోని మూడు నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 76.42 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య హోరాహోరి పోరాటం జరిగింది. ఇరు పక్షాలకు చెందిన కార్యకర్తలు పలుచోట్ల రాళ్లు రువ్వుకున్నారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని మూడు లోక్‌సభ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 72.45 శాతం పోలింగ్ జరిగింది. కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఒకే ఒక లోకసభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో 77.49 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

చిత్రం..జమ్ముకాశ్మీర్ ఉధంపూర్ జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఓటు వేసేందుకు బారులు తీరిన ఓటర్లు