జాతీయ వార్తలు

26/11 దాడి ఫైనాన్సియర్‌కు జుడీషియల్ కస్టడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్, ఆగస్టు 22: ముంబయి నగరంపై 2008లో దాడి చేసేందుకు లష్కర్ ఎ తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాదులకు సుమారు రూ. నాలుగు మిలియన్ల సహాయం చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సుఫయాన్ జాఫర్ అనే వ్యక్తిని పాకిస్తాన్‌లోని ఓ కోర్టు జుడీషియల్ కస్టడీకి పంపించింది. సుఫయాన్‌ను విచారణ కోసం మరికొన్ని రోజులు తన కస్టడీకి అప్పగించాలన్న ఎఫ్‌ఐఎ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీంతో పోలీసులు సుఫయాన్‌ను రావల్పిండిలోని కట్టుదిట్టమైన భద్రత గల అడియాలా జైలుకు తరలించారు. ఈ కేసులో అనుమానితులయిన మరో ఆరుగురు అబ్దుల్ వాజిద్, మఝర్ ఇక్బాల్, హమ్మద్ అమీన్ సాదిక్, షాహిద్ జమీల్ రియాజ్, జమీల్ అహ్మద్, మొహమ్మద్ యూనిస్ అంజుమ్ 2009 నుంచి ఇదే జైలులో విచారణ ఖైదీలుగా ఉంటున్నారు. సుఫయాన్ జాఫర్‌ను జుడీషియల్ కస్టడీకి పంపిస్తూ ఉగ్రవాద వ్యతిరేక కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. అనుమానితుడిని విచారించేందుకు ఫెడరల్ ఇనె్వస్టిగేషన్ ఏజెన్సీకి ఇప్పటికే తగినంత సమయం ఇవ్వడం జరిగిందని పేర్కొంది.