జాతీయ వార్తలు

ప్రతిపక్షాల్లోనూ మిత్రులున్నారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: ప్రతిపక్షాల్లోనూ తనకు మిత్రులున్నారని, వ్యక్తిగత జీవితానికి, రాజకీయాలకు సంబంధం లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్‌కు ఓ ఛానల్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడుతూ రాజకీయాలతో సంబంధం లేని పలు అంశాలను ప్రస్తావించారు. రోజూ ఉదయం 5 గంటల సమయంలో ‘ఛాయ్’ తాగడం తనకు అలవాటని.. అదే విధంగా సాయంత్రం ఒకసారి ఛాయ్ తాగుతానని చెప్పారు. ఇస్ర్తి చేసిన కుర్తా, పైజామా ధరించడం, బూట్లు వేసుకోవడం, గడ్డాన్ని ఎప్పటికప్పుడు ట్రిమ్మింగ్ చేయించుకోవడం తనకు ఇష్టమని చెప్పారు. ఆయుర్వేద ఔషధాలను వాడతానని తెలిపారు. తాను చాలా కఠినంగా వ్యవహారిస్తానని అందరూ అనుకుంటుంటారు కానీ అందులో నిజం లేదని మోదీ చెప్పారు. బంట్రోతు నుంచి చీఫ్ సెక్రటరీ వరకు ప్రతి ఒక్కరినీ గౌరవిస్తానని, వారు పనిచేసే విధానం మెరుగుపడేలా చూస్తానని చెప్పారు. అయితే ప్రజలకు హితం కానీ ఏ చర్యనైనా తాను ఖండిస్తానని స్పష్టం చేశారు. అలాంటి విషయాల్లో చాలా కఠినంగా వ్యవహారిస్తానని తెలిపారు. రోజుకు సుమారు మూడున్నర గంటల పాటు నిద్ర పోతానని, ప్రకృతి వైద్య విధానాలు అవలంభిస్తానని ఆయన వివరించారు.