జాతీయ వార్తలు

బీజేపీని తరిమికొట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫతేపూర్ (ఉత్తరప్రదేశ్), ఏప్రిల్ 24: విభజించి పాలించు అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్న బీజేపీని తరిమికొట్టండని ప్రజలకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు. దేవ ప్రజలను విభజించడం, కులమతాల మధ్య చిచ్చుపెట్టడం వంటి చర్యలతో లాభపడాలని చూస్తున్నదని బుధవారం ఇక్కడ జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ప్రియాంక బీజేపీపై నిప్పులు చెరిగారు. 3మనుషులను విభజించే రాజకీయాలు మనకు వద్దు. దేశాన్ని ముక్కలు చేసే విధానాలు అసలే వద్దు. మన సమస్యలు తెలుసుకొని, వాటిని పరిష్కరించే ప్రభుత్వం అవసరం. అందుకే, అటు కేంద్రంలో, ఇటు ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించి, కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలకు పగ్గాలు అప్పగించండి. దేశాభివృద్ధికి సహకరించండి2 అని కోరింది. అబద్ధాలు, అభూత కల్పనలతో ప్రధాని నరేంద్ర మోదీ రోజులు నెట్టుకొస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రజలతో బీజేపీకి అసలు సంబంధాలే లేవని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ మాదిరి ప్రజల్లో ఉండే పార్టీ కాదంటూ బీజేపీపై నిప్పులు చెరిగారు. మోదీ నాయకత్వంలో దేశం ఇప్పటికే ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నదని, ఇకనైనా మేల్కొని, వాస్తవాలను గ్రహించి ఆయనను గద్దెదించాలని కోరారు. యూపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని ఒక మహిళా టీచర్ తనకు చెప్పిందని ప్రియాంక అన్నారు. ఆమె జీతాన్ని యూపీ సర్కారు నిలిపివేసిందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చర్యలు క్షమార్హం కావని తెలిపారు. దేశాన్ని పతనం నుంచి రక్షించి, అభివృద్ధి పథంలో నడిపించాలంటే కాంగ్రెస్‌కు అధికారం అప్పగించాలని ఆమె కోరారు.