జాతీయ వార్తలు

ప్రజాసమస్యల పరిష్కారానికే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ‘ఏసీ రూముల్లో కూర్చుని దేశంలోని సమస్యలపై ట్వీట్ చేయడం సులభమే.. కాని నేను ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కార మార్గాన్ని కనుగొనడానికి రాజకీయాల్లోకి వచ్చా’ అని క్రికెటర్ నుంచి రాజకీయ నేతగా మారిన గౌతమ్ గంభీర్ అన్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన ఈ యువ క్రికెటర్ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈస్ట్ ఢిల్లీ నుంచి ఆ పార్టీ ఎంపీగా రంగంలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అరవీందర్ సింగ్ లవ్‌లీ, ఆప్ అభ్యర్థి అతిషీ రంగంలో ఉండటంతో ముక్కోణపు పోటీని ఎదుర్కొంటున్న గంభీర్ గురువారం విలేఖరులతో మాట్లాడారు. ఢిల్లీని లండన్, పారిస్‌లా గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతానని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తరచూ చేస్తున్న ప్రకటనలను ఆయన ప్రస్తావిస్తూ లండన్, పారిస్‌లా కాకపోయినా దేశ రాజధాని అయిన ఈ నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని గంభీర్ అన్నారు. తాను క్రికెట్‌ను నిజమైన స్ఫూర్తితోనే ఆడానని, అదే విధానాన్ని రాజకీయాల్లో సైతం పాటించాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలన్న కేజ్రీవాల్ డిమాండ్‌ను ఆయన ప్రస్తావిస్తూ ఆప్ పార్టీ తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడాకి ఈ ఎన్నికల్లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తోందని విమర్శించారు. క్రికెట్ ఆడుతున్నప్పుడు దూకుడు స్వభావంతో కన్పించే గంభీర్ విలేఖరుల సమావేశంలో మాత్రం వారు అడిగే ప్రశ్నలకు ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు. మీ నియోజకవర్గ పరిధిలో ఎన్ని అసెంబ్లీ స్థానాలు, ఎన్ని వార్డులున్నాయి అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు ఆయన ఏమాత్రం ఆవేశపడకుండా పది అసెంబ్లీ, 39 వార్డులున్నాయని కూల్‌గా సమాధానం చెప్పడం ఆశ్చర్యపరిచింది. ప్రధాని నరేంద్రమోదీ పాలన తనను ఎంతో ఆకట్టుకుందని పేర్కొన్న ఆయన తన నియోజకవర్గ అభివృద్ధిపై ఒక స్పష్టత, విజన్ ఉందని తెలిపారు. తనతో ఉన్న బీజేపీ నేతలు, కార్యకర్తల సహాయ సహకారాలతో ఈస్ట్ ఢిల్లీలో ఘన విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. సిట్టింగ్ బీజేపీ ఎంపీ మహేష్ గిరికి టికెట్ నిరాకరించడంపై ఆయన మాట్లాడుతూ అది అధిష్టానం తీసుకున్న నిర్ణయమని, ఆ విషయం గురించి తాను ప్రస్తావించదల్చుకోలేదని అన్నారు. ఎంపీగా ఆయన ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశారని ప్రశంసించిన ఆయన నియోజకవర్గ అభివృద్ధిపై ఇప్పటికే తనకు ఒక స్పష్టత ఉందని, అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అజెండాగా ముందుకు సాగుతానని అన్నారు.

చిత్రం...ఢిల్లీలో గురువారం విలేఖరులతో మాట్లాడుతున్న ఈస్ట్ ఢిల్లీ బీజేపీ అభ్యర్థి గౌతమ్ గంభీర్