జాతీయ వార్తలు

నౌకాదళానికి మరింత దన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: భారత నౌకాదళాన్ని అన్నివిధాలుగా శక్తివంతం చేసేందు కు విస్తృత స్థాయిలో చర్యలు చేపడుతున్నామని అధికార వర్గాలు తెలిపాయి. నేవీ నిర్వహణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడంలో భాగంగానే యుద్ధనౌకలు, జలాంతర్గాములు, యుద్ధ విమానాలను సమకూర్చుకునే ప్రయత్నం జరుగుతోందని ఈ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో నౌకాదళ వ్యూహాత్మక ప్రాధాన్యత పెంపొందించాలన్న ఉద్దేశంతోనే ఓ మెగాప్లాన్‌పై దృష్టిపెట్టామని వెల్లడించాయి. 200 యుద్ధనౌకలు, 500 యుద్ధ విమానాలు, 24 జలాంతర్గాములను ఈ పథకంలో భాగంగా సమకూర్చుకుంటామని ఈ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం నౌకాదళం వద్ద 132 యుద్ధనౌకలు, 220 యుద్ధ విమానాలు, 15 జలాంతర్గాములు ఉన్నాయి. వీటి సంఖ్యను గణనీయంగా పెంచితేనే తీర ప్రాంతంలో వ్యూహాత్మక పట్టు సాధ్యమవుతుందని వెల్లడించాయి. నౌకాదళాన్ని ఏవిధంగా శక్తివంతం చేయాలనే దానిపై త్రివిధ దళాల కమాండర్లు మూడు రోజుల సమావేశంలో విస్తృతంగా చర్చించారు. నౌకాదళానికి సంబంధించిన అన్ని కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. నౌకదళ నిర్వహణా ప్రమేయం సామర్థ్యత, సామర్థ్యాన్ని మెరుగుపర్చడం వంటి అనేక అంశాలపై నౌకాదళ ప్రధాన అధికారి అడ్మిరల్ సునీల్ లంబా ఈ సందర్భంగా మాట్లాడారని నౌకాదళ అధికార ప్రతినిధి కెప్టెన్ డీకే శర్మ తెలిపారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతున్న నేపథ్యంలో భారత నౌకాదళాన్ని కూడా అన్ని విధాలుగా శక్తివంతంగా చేయాల్సిన అవసరం గురించి ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారని ఆయన తెలిపారు.