జాతీయ వార్తలు

దగాకోరు ఒప్పందమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం కారణం గా తెలంగాణకు నష్టం జరగకుండా తక్షణం తాము తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ఒప్పందం కారణంగా తెలంగాణకు జరిగే నష్టాలను ఆయన మీడియాకు వివరించారు. కెసిఆర్ రాజీనామా చేయాలా లేదా తప్పు దిద్దుకోవాలా అన్నది ఆయన విజ్ఞతకే వదిలిపెడుతున్నామన్నారు. అంతర్రాష్ట్ర ఒప్పందాలకు ముందు సాంకేతిక కమిటీ తర్వాత స్టాండింగ్ కమిటీ అనంతరం ఇంటర్ స్టేట్ బోర్డు సమావేశాలను నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. సాంకేతిక కమిటీలు ఇరు రాష్ట్రాలకు చెందిన చీఫ్ ఇంజనీర్లు వారితో పాటు మహారాష్ట్ర, తెలంగాణ జిల్లాలకు చెందిన కలెక్టర్లు సభ్యులుగా ఉంటారని అలాగే స్టాండింగ్ కమిటీలో ఇరు రాష్ట్రాలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, చైర్మన్ కో చైర్మన్లుగా ఉంటారని పేర్కొన్నారు. ఇక ఇంటర్ స్టేట్ బోర్డులో ఇరు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు చైర్మన్, కో చైర్మన్‌గా ఉంటారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే 1975లో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఇరు రాష్ట్రాల సిఎంల సమావేశం జరిగిందని అపుడే ప్రాజెక్టులపై ఒప్పందం కూడా చేసుకున్నారని పేర్కొన్నారు. 2012లో చేసుకున్న ఒప్పందం ప్రకారం తుమ్మిడిహెట్టి వద్ద 160 టిఎంసిల నీటిని వినియోగించుకోవడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర తేల్చి చెప్పడం జరిగిందని గుర్తుచేశారు. రోజుకు 1.8 టిఎంసిలు చొప్పున 90 రోజుల్లో 160 టిఎంసిలను వాడుకోవడానికి మహారాష్ట్ర ఆమోదిస్తూ అందుకు అనుగుణమైన ఎత్తిపోతలను నిర్మించుకోవడానికి కూడా ఆమోద ముద్ర వేసిందన్నారు. దీని తర్వాత 2014 ఆగస్టు 16న సాంకేతిక నిపుణుల కమిటీ సమావేశం జరిగిందని పేర్కొన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద హక్కుగా ఉన్న 160 టిఎంసిలను 90 రోజుల్లో తీసుకోవాలంటే 154 మీటర్లు ఎత్తున ప్రాజెక్టు నిర్మించాల్సి ఉంటుందని, అలాగే ప్రాజెక్టు ఎత్తు 152 మీటర్లు ఉండేలా చూడాలని దీనివల్ల మహారాష్టల్రో ఒక్క గ్రామానికి చెందిన 1800 ఎకరాల భూమి మాత్రమే ముంపునకు గురవుతుందని వివరించారు. ఇవన్నీ అధికారిక మినిట్స్‌లో ఉన్నాయన్నారు. దీని ప్రకారం 2014లోనే తుమ్మిడిహెట్టి నిర్మాణానికి ఆమోదం లభించిందని చెప్పారు. సాంకేతిక నివేదిక ప్రకారం మహారాష్ట్ర సిఎంతో ఎందుకు చర్చలు జరపలేదని ఆయన నిలదీశారు. ఇది కాకుండా గోదావరి జలాల వినియోగంపై ఐదుగురు రిటైర్డ్ సిఇలతో తెలంగాణ ప్రభుత్వం నియమించిన కమిటీ పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే ఇంతవరకూ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా 10వేల కోట్ల రూపాయిల ఖర్చుతో నిర్మించిన కట్టడాలన్నీ ఉపయోగంలోకి వస్తాయని పేర్కొందని రేవంత్ పేర్కొన్నారు. 2012 నాటి ఒప్పందాలను విస్మరించి తెలంగాణకు ద్రోహం చేసేలా మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకున్నారని రేవంత్ నిప్పులు చెరిగారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును 148 మీటర్లకు తగ్గించి కేవలం ఆదిలాబాద్ జిల్లాలకు మాత్రమే పరిమితం చేస్తే అక్కడ మంచినీళ్లు తీసుకునే అవకాశమే ఉండదని అన్నారు. మహారాష్ట్ర ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే చనాక, కొరాట ప్రాజెక్టులో 20 శాతం నీటి వాటాను ఉచితంగా ఇస్తానని కేసిఆర్ ఎలా ఒప్పుకున్నారని నిలదీశారు. తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టుల్లోని మత్స్యసంపదలో 50 శాతం నౌకాయాన ఆదాయంలో మరో 50 శాతం మహారాష్టక్రు ఏ విధంగా హక్కు కల్పిస్తారని నిలదీశారు. ఇదివరకు ఉన్న అంతర్రాష్ట్ర ఒప్పందం ప్రకారం కేవలం ప్రాణహిత నదిపై నిర్మించే ప్రాజెక్టులకు మాత్రమే మహారాష్ట్ర అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోవాలని ఉండగా, ప్రస్తుతం కెసిఆర్ చేసుకున్న ఒప్పందం ప్రకారం తెలంగాణ హక్కున్న గోదావరి జలాలపై కూడా మహారాష్టక్రు హక్కు కల్పించారని పేర్కొన్నారు. ఈ విధంగా చేయడం ద్వారా తెలంగాణ తలను మహారాష్టక్రు కెసిఆర్ అప్పగించారని అన్నారు.