జాతీయ వార్తలు

అనంత్‌నాగ్‌లో కర్ఫ్యూ ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, ఆగస్టు 27: నలభై తొమ్మిది రోజుల తర్వాత శనివారం జమ్మూ, కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ పట్టణంలో కర్ఫ్యూను ఎత్తివేశారు. అయితే వేర్పాటువాదులు శ్రీనగర్‌లోని బాదామీబాగ్‌లో ఉన్న ఆర్మీ ప్రధాన కార్యాలయానికి ప్రదర్శన నిర్వహించనున్న దృష్ట్యా శాంతిభద్రతలను కాపాడడానికి ముందు జాగ్రత్త చర్యగా శ్రీనగర్‌సహా కాశ్మీర్ లోయలోని మిగతా పట్టణాల్లో కర్ఫ్యూ యథాతథంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో హురియత్ కాన్ఫరెన్స్ అతివాదవర్గం నాయకుడు సయ్యద్ అలీ షా జిలానీని అదుపులోకి తీసుకున్నారు.
అనంత్‌నాగ్ పట్టణంలో ఈ రోజు ఉదయం కర్ఫ్యూను ఎత్తివేశారని, అయితే జనం గుమికూడడంపై ఆంక్షలు కొనసాగుతాయని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. అయితే శ్రీనగర్‌తో పాటుగా పుల్వామా, పాంపోర్ పట్టణాల్లో కర్ఫ్యూ కొనసాగుతోందని ఆయన చెప్పారు. కర్ఫ్యూ, ఆంక్షలు, వేర్పాటువాదుల బంద్ కారణంగా కాశ్మీర్‌లోయలో 50వ రోజు కూడా జనజీవనం స్తంభించిపోయింది. షాపులు, ప్రైవేటు ఆఫీసులు, విద్యాసంస్థలు, పెట్రోలు పంపులు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు తిరగలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకుల్లో ఉద్యోగుల హాజరు కూడా పలచగా ఉంది. మొబైల్ ఇంటర్నెట్ సేవలు, ప్రీపెయిడ్ మొబైల్స్‌పై బైటికి వెళ్లే కాల్స్‌పై నిషేధం కూడా కొనసాగుతోంది. కాగా, వనీ హత్యకు నిరసనగా ఆందోళనల్లో పౌరుల మృతికి నిరసనగా జరుగుతున్న ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న వేర్పాటువాదులు కాశ్మీర్ లోయలో బంద్ పిలుపును సెప్టెంబర్ 1 దాకా పొడిగించారు.
పోలీసు కాల్చివేత
పుల్వామా జిల్లాలో మిలిటెంట్లు ఒక పోలీసు కానిస్టేబుల్‌ను కాల్చి చంపారు. గుర్తు తెలియని దుండగులు శనివారం ఉదయం కానిస్టేబుల్ ఖుర్షీద్ అహ్మద్ గనైపై కోలీలోని అతని నివాసం బైట కాల్పులు జరిపారని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. తీవ్రంగా గాయపడిన ఖుర్షీద్‌ను ఆస్పత్రికి తరలించగా, అతను అక్కడ చనిపోయాడని ఆయన చెప్పారు.