జాతీయ వార్తలు

‘వౌఖిక తలాక్’ను నిషేధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 31: ముస్లిం వ్యక్తి తన భార్యకు మూడుసార్లు వౌఖికంగా ‘తలాక్ తలాక్ తలాక్’ అని చెబితే విడాకులు ఇచ్చేసినట్టే. అయితే ఏకపక్షంగా నోటితో మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులివ్వడాన్ని నిషేధించాలని దేశంలో మహిళల స్థితిగతులను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. అలాగే బహు భార్యత్వంపై కూడా నిషేధం విధించాలని ఈ కమిటీ సిఫారసు చేసినట్లు తెలిసిందని ఒక ఆంగ్ల దినపత్రిక తన గురువారం సంచికలో ప్రచురించిన వార్తాకథనంలో పేర్కొంది. ఈ కథనం ప్రకారం.. కాంగ్రెస్ నేతృత్వంలోని గత యుపిఎ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ ఉన్నత స్థాయి కమిటీ గత సంవత్సరం సమర్పించిన తన నివేదికలో ముస్లిం మతానికి చెందిన కుటుంబాలకు సంబంధించిన చట్టాలను కూడా మదింపు చేసింది. అయితే ఈ కమిటీ చేసిన సిఫార్సులను ఇంతవరకు అధికారికంగా బహిర్గతం చేయలేదు.
అయితే మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులిచ్చే విధానానికి వ్యతిరేకంగా ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారిస్తూ ఉన్నత స్థాయి కమిటీ సమర్పించిన నివేదికను ఆరు వారాలలోగా సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులు ఇచ్చే పద్ధతి వల్ల ముస్లిం కుటుంబాలలోని భార్యల పరిస్థితి దయనీయంగా ఉందని, వారి వైవాహిక జీవితం అభద్రతలో కొట్టుమిట్టాడుతోందని, అందువల్ల ఈ విధానాన్ని రద్దు చేయాలనే డిమాండ్‌ను కమిటీ తన నివేదికలో సమర్థించింది. డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ యాక్ట్- 1939ను సవరించాలని కూడా కమిటీ తన నివేదికలో సిఫార్సు చేసింది. యుపిఎ ప్రభుత్వ హయాంలో స్ర్తిశిశు సంక్షేమ మంత్రి త్వ శాఖ 2012లో ఏర్పాటు చేసిన ఈ 14మంది సభ్యుల కమిటీని 2013 మేలో పునర్ వ్యవస్థీకరించారు. పంజాబ్ విశ్వవిద్యాలయానికి చెంది న సెంటర్ ఫర్ వుమెన్స్ స్టడీస్ వ్యవస్థాపక డైరెక్టర్ పామ్ రాజ్‌పుత్ ఈ కమిటీకి నేతృత్వం వహించారు. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ (బిఎంఎంఎ) గత సంవత్సరం నిర్వహించిన ఒక సర్వేలో 92.1 శాతం మంది భారతీయ ముస్లిం మహిళలు నోటితో మూడుసార్లు తలాక్ చెప్పే విధానాన్ని నిషేధించాలని కోరారు.