జాతీయ వార్తలు

జయహో ఇస్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 28: వినూత్న ప్రయోగాల్లో భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను ప్రపంచ దేశాలకు మరోసారి మన శాస్తవ్రేత్తలు చాటి చూపించారు. రోదసి ప్రయోగాల పరీక్షల్లో మరోసారి ఇస్రో శాస్తవ్రేత్తలు తమ శక్తిసంపద ఏమిటో మరోసారి విశ్వానికి చూపించారు. వినీలాకాశంలో భారత త్రివర్ణ పతాకం మరోసారి రెపరెపలాడింది. తక్కువ ఖర్చుతో అధిక బరువుగల భారీ ఉపగ్రహాలను రోదసి లోకి పంపేందుకు ఇస్రో చేపట్టిన అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ లాంచింగ్ వెహికల్ (ఎటీవి) ద్వారా స్క్రాంజెట్ రాకెట్ ఇంజన్‌ను ఆదివారం విజయవంతంగా ప్రయోగించారు. నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఆదివారం ఉదయం 6గంటలకు చేపట్టిన ఎటివి ప్రయోగం దిగ్విజయంగా నింగిలోకి దూసుకెళ్లింది. ముందుగా ఉదయం 6గంటల నుండి 10గంటల మధ్యలో పూర్తిచేయాలని నిర్ణయించినప్పటికీ, వాతావరణం అనుకూలించడంతో శనివారం రాత్రి 1:30గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించి ఆదివారం ఉదయం 6గంటలకే ఏటీవిని ప్రయోగించారు.
షార్‌లోని రోహిణి ఆర్‌హెచ్ 560 సౌండింగ్ రాకెట్ వేదికపై ఏటివి ఉపగ్రహ వాహక నౌకకు స్క్రాంజెట్ ఇంజన్‌ను అమర్చి ప్రయోగించారు. 3227కిలోల బరువున్న ఇంజన్లను తీసుకుని బయలు దేరిన రాకెట్ భూవాతావరణంలోని ప్రాణవాయువును వినియోగించుకుని ఇగ్నిషన్ ప్రక్రియను పూర్తి చేసింది. రాకెట్ భూమి నుండి 70కి.మీ ఎత్తుకి విజయవంతంగా చేరుకున్న తరువాత శాస్తవ్రేత్తలు రాకెట్‌లోని స్క్రామ్‌జెట్ ఇంజన్‌ను సుమారు 5సెకన్లపాటు మండించారు. అనంతరం మొత్తం 3227 బరువుగల రాకెట్ తన రెండు దశలను విజయవంతంగా పూర్తిచేసి షార్‌కు 320కి.మీ దూరంలో బంగాఖాఖాతంలో రాకెట్‌ను తిరిగి క్షేమంగా దింపారు. రాకెట్ ప్రయోగం మొత్తం 60సెకన్లలో పూర్తయ్యింది. భూ వాతావరణంలోని గాలిని వినియోగించుకుని భవిష్యత్‌లో తక్కువ వ్యయంతో రాకెట్ రూపొందించి వాటి ద్వారా అధిక బరువుగల ఉపగ్రహాలను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎటీవి రాకెట్‌ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించింది. ఈ విజయంతో శాస్తవ్రేత్తల కృషి ఫలించడమే కాకుండా షార్ నుండి భారీ ప్రయోగాలకు మార్గం సుగమం అవ్వడమే కాకుండా ఒక ప్రయోగంలో వాడిన రాకెట్ పరికరాలను పునర్వినియోగించవచ్చు. ఈ ప్రయోగంతో రాకెట్ ప్రయోగ వ్యయం తగ్గనుంది. భవిష్యత్‌లో బరువైన రాకెట్లను నింగిలోకి ప్రయోగించే అవకాశం ఉంది. ఇస్రో చైర్మన్ ఎఎస్.కిరణ్ కుమార్, షార్ డైరెక్టర్ కున్హికృష్ణన్, విఎస్‌ఎస్‌సి డైరెక్టర్ డాక్టర్ శివన్ షార్‌కు చేరుకొని ప్రయోగాన్ని దగ్గరుండి తిలకించారు. ఎటీవిని రూపకల్పన చేసిన టీమ్‌ను, శాస్తవ్రేత్తలను ప్రధాని మోదీ అభినందించారు.

చిత్రం.. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్తున్న ఏటివి రాకెట్