జాతీయ వార్తలు

పనిచేస్తే పురస్కారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టార్టప్ ఇండియా/ స్టాండప్ ఇండియాలాంటి పథకాలను అమలు చేయడంలో అద్భుతంగా కృషి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సివిల్ సర్వీస్ అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ సన్మానించనున్నారు. ఇందుకోసం సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ అయిదు ప్రాధాన్యతా పథకాలు ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామ యోజన, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, స్టార్టప్ ఇండియా/స్టాండప్ ఇండియా, ఇ-నేషన్ వ్యవసాయ మార్కెట్ (జాతీయ ఇ-మండి)లను ఎంపిక చేసింది. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన వ్యవసాయ రంగంలో సాగు విస్తీర్ణం పెంపు, నీటి వినియోగ సామర్థ్యం మెరుకోసం ఉద్దేశించినది కాగా, దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన, గ్రామీణ విద్యుదీకరణకు సంబంధించిన పథకం, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పంటల బీమాకు సంబంధించినది కాగా, దేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి స్టార్టప్ ఇండియా/స్టాండప్ ఇండియా పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అద్భుతంగా కృషి చేసినందుకు సివిల్ సర్వీసెస్ దినోత్సవం రోజు ఏప్రిల్ 21న ఎంపిక చేసిన అధికారులకు ప్రధానమంత్రి అవార్డులను అందజేస్తారు. అవార్డులు పొందిన జిల్లాలు, లేదా సంస్థలకు ప్రోత్సహంగా పది లక్షలు ఇస్తారు.