జాతీయ వార్తలు

శాంతికాముకులతో చర్చలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 28: హింసను వ్యతిరేకించే, శాంతి పునరుద్ధరణకు తోడ్పడే ఎవరితోనైనా చర్చలు జరపడానికి తాము సిద్ధమేనని జమ్మూ, కాశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబ్ ముఫ్తీ చెప్పారు. వేర్పాటువాదులు గనుక శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నట్లయితే వారితో కూడా చర్చలు జరపడానికి తమకెలాంటి అభ్యంతరం లేదని ఆమె అన్నారు. అయితే అదే సమయంలో చర్చలకు అనువైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం, అలాగే భద్రతా దళాల శిబిరాలను ఘెరావ్ చేసి దాడి చేసేలా యువతను రెచ్చగొడుతున్న కొంతమంది వ్యక్తులు హింసను ప్రేరేపించడాన్ని ఆపాలని ఆమె అన్నారు. కాగా, చర్చల ప్రక్రియ గతంలో జరిగిన దానికన్నా మెరుగ్గా ఉండాలని భవిష్యత్తు కార్యాచరణపై చర్చించడానికి శనివారం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన మెహబూబా ముఫ్తీ స్పష్టం చేశారు. కాశ్మీర్ సమస్య పరిష్కారానికి వివిధ వర్గాలతో చర్చలు జరపడానికి యుపిఏ ప్రభుత్వం మధ్యవర్తులను నియమించడం, వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేయడం తెలిసిందే. అటు పాకిస్తాన్‌తోను, ఇటు అంతర్గతంగా హురియత్ కాన్ఫరెన్స్‌తోను, హిజ్బుల్ ముజాహిదీన్ మిలిటెంట్ సంస్థతోను చర్చలు జరపడానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చిత్తశుద్ధితో ప్రయత్నించారని, అయితే ఆ ప్రయత్నం మధ్యలోనే ఆగిపోయిందని పిటిఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మెహబూబా ముఫ్తీ అంటూ, ఆ ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. చర్చల ప్రక్రియపై జనానికి నమ్మకం లేకుండా పోయిందని, దీన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తాను ప్రధాని మోదీకి చెప్పానని ఆమె అన్నారు. అనుభవజ్ఞులైనవారు, ఎదుటి వారితో మాట్లాడగలిగిన వారిని చర్చలకోసం మధ్యవర్తులుగా నియమించాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఈ సమస్యకు ఏదో ఒక రకమైన పరిష్కారాన్ని కనుగొనడానికి చర్చలు జరిపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంసిద్ధత వ్యక్తం చేశారని ఆమె అన్నారు. అయితే పరిష్కారం రోజుల్లోనో లేదా నెలల్లోపల రాదనే విషయాన్ని కాశ్మీర్ సమస్యకు పరిష్కారం కావాలని కోరుకుంటున్న వారు అర్థం చేసుకోవాలని మెహబూబా స్పష్టం చేశారు. ‘అయితే పరిష్కారం వచ్చే దాకా జనాలు దుర్భర జీవితం గడపాలా? అమాయకులైన యువకులు చనిపోవాలా? ప్రతిహింసకు దారితీసే పనికివారు పాల్పడాలని మనం కోరుకుంటున్నామా?’ అని ఆమె ప్రశ్నిస్తూ, ప్రతి ఒక్కరూ ఈ విషయం గురించి ఆలోచించాలన్నారు. ఎవరితో చర్చలు జరపాలని అడగ్గా, హింసను వ్యతిరేకించే, శాంతిని కోరుకునే, శాంతి పునరుద్ధరణకు తోడ్పడడానికి సిద్ధంగా ఉండే ఎవరితోనైనా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని ఆమె స్పష్టం చేశారు. చర్చలకు ప్రత్యామ్నాయం లేదని, అయితే చర్చలు జరపడానికి అందుకు అనువైన వాతావరణం ఉండాలని ఆమె స్పష్టం చేశారు.