జాతీయ వార్తలు

షూటర్ కూతురికి తండ్రి ఖరీదైన గిఫ్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహ్మదాబాద్, ఆగస్టు 28: అతనో ఆటో రిక్షా డ్రైవర్. రోజూ ఆటోనడుపుకుంటే తప్ప జీవితం గడవడం కష్టం. జాతీయ స్థాయిలో మంచి షూటర్‌గా ఎదిగిన కూతురు మరింత రాణించేందుకు తాను ఆమె వివాహం కోసం దాచిపెట్టిన అయి దు లక్షల రూపాయలను ఖర్చు చేసి జర్మన్ తయారీ రైఫిల్‌ను బహుమతిగా కొనిచ్చాడు. మనిలాల్ గోహిల్(50), అనే ఈ ఆటో డ్రైవర్ కూతురు మిట్టల్ (27) 2012నుంచి షూటింగ్ పోటీల్లో పాల్గొంటోంది. రైఫిల్ క్లబ్ నుంచి రైఫిల్‌ను అరువుగా తెచ్చుకుని పోటీల్లో పాల్గొంటూ వచ్చింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో రాణించాలంటే ప్రపంచ అత్యున్నత శ్రేణి రైఫిల్ ఆమెకు అవసరమని గోహిల్ గుర్తించాడు. అహ్మదాబాద్‌లో రోజుకు రూ.500 సంపాదించే గోహిల్‌కు అన్ని ఖర్చులు పోను మిగిలేది చాలా స్వల్పం. అయినప్పటికీ, ధైర్యం వీడకుండా, మిట్టల్ వివాహం కోసం దాచి ఉంచిన రూ.5లక్షలు ఖర్చు చేసి జర్మన్ రైఫిల్‌ను కొని ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చాడు. దేశం గర్వించేవిధంగా ఆమె కీర్తిప్రతిష్ఠలు సంపాదించాలన్నదే తన ఆశయమని గోహిల్ అన్నాడు.