జాతీయ వార్తలు

విమానాశ్రయాల్లో భద్రతకు ఢోకా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: భారత విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. బ్రెజిల్, ఇస్తాంబుల్‌లో జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో సిఐఎస్‌ఎఫ్ (కేంద్ర పరిశ్రమల భద్రతా దళం) ప్రత్యేక శిక్షణతో దేశంలోని విమానాశ్రయాల్లో భద్రతను పెంచింది. క్విక్ రియాక్షన్ టీమ్స్ ఉగ్రదాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని, విమానాశ్రయాల్లో భద్రతకు ఢోకా లేదని సిఐఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు.
సుశిక్షితులైన సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు, అధునాతన ఆయుధాలతో ఉగ్రదాడులను ఎదుర్కొంటారని, విమానాశ్రయాల్లో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తారని అధికారి పేర్కొన్నారు. విమానాశ్రయాల్లో అరైవల్, డిపార్చర్ విభాగాల వద్ద డాగ్ స్క్వాడ్, మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఎవరైనా ఉగ్రవాదులు ఫైరింగ్‌కు పాల్పడినా..విమానాశ్రయంలోకి ప్రవేశించినా ఎదుర్కొనేందుకు సిఐఎస్‌ఎఫ్ దళాలు సిద్ధంగా ఉన్నాయని, నాకా బందీ నిర్వహించి అనుమానిత వాహనాలను తనిఖీ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. విమానాల హైజాక్, ఉద్రవాదుల దాడులను తిప్పికొట్టేందుకు భద్రతా దళాలను మోహరింపజేశామన్నారు. దేశంలోని 59 ప్రధాన విమానాశ్రయాల్లో సిఐఎస్‌ఎఫ్ దళాలు భద్రత బాధ్యతలు చేపట్టింది. మరో 39 విమానాశ్రయాల్లోనూ సిఐఎస్‌ఎఫ్ దళాలను నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, సుమారు 1.45 లక్షల భద్రతా సిబ్బంది శిక్షణ పొందిందని, 25వేల మంది మహిళ, పురుష కమెండోలు విధినిర్వహణలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.