జాతీయ వార్తలు

మళ్లీ మేమే వస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలీగంజ్, మే 15: లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పటి వరకూ జరిగిన పోలింగ్‌లో ఎన్‌డీఏకే స్పష్టమైన మెజారిటీ వస్తుందన్న వార్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రభుత్వం భవిష్యత్ కార్యచరణను ప్రకటించారు. బుధవారం ఆఖరు విడత ప్రచారం నిర్వహించిన మోదీ బిహార్‌కు వికాస్ కీ గంగా(స్వచ్ఛగంగ) పథకాన్ని ప్రకటించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రతిపక్షాలపై మోదీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. జాతీయ భద్రతపై వారికి ఏమాత్రం శ్రద్ధలేదని, ఉగ్రమూకలు అమాయకులను పొట్టనబెట్టుకున్నా పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రధాని విమర్శించారు. ‘బిహార్‌లో ఇది నా ఆఖరి ఎన్నికల ప్రచారం. నాపై మీరు చూపిస్తున్న ప్రేమానురాగాలు మరువలేను. నాతో పాటు వేదికపై ఆశీసునులైన మిత్రపక్షాల సమక్షంలో చెబుతున్నా. ఫలితాలు ఎన్‌డీఏకే అనుకూలంగా రానున్నట్టు సంకేతాలున్నాయి’అని ప్రధాని వెల్లడించారు. ఆఖరి విడత పోలింగ్‌లోనూ ఓటేసి అఖండ విజయం చేకూర్చాలని ఆయన అభ్యర్థించారు. పాటలీపుత్ర పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన మోదీ బీజేపీ నాయకత్వంలోనే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా మాట్లాడుతూ ఇప్పటి వరకూ వివిధ దశల పోలింగ్‌లో తాము మెజారిటీ మార్క్‌ను దాటేశామని చెప్పడం గమనార్హం. ‘కేంద్రంలో మళ్లీ మేం అధికారంలోకి వస్తున్నాం. 300 సీట్లకుపైగానే మేం గెలుచుకుంటున్నాం’అని షా ధీమాగా చెప్పారు. 2014కు ముందు పాక్ ప్రేరిత ఉగ్రవాదుల ఆగడాలకు అడ్డూఅదుపూ ఉండేదికాదని మోదీ అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఉగ్రవాదాన్ని అణచివేశామని ఆయన ప్రకటించారు. కేంద్ర బలగాలకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చినట్టు ప్రధాని స్పష్టం చేశారు. అమాయకులను ప్రాణాలను బలితీసుకుంటున్న ఉగ్రమూలకపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించిందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షాలు జాతీయ భద్రత సమస్యను పట్టించుకోవడమే లేదన్న మోదీ ‘ఎందరో అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకుంటున్నా ఉగ్రవాదులపై ఎందుకంత ఉదాసీనంగా ఉంటున్నారో ఆశ్చర్యంగా ఉంది’అని వ్యాఖ్యానించారు. సొంత ప్రయోజనాల కోసమే ఆ పార్టీలు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలో బలంగా ఉన్న యాదవ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ సామాజికవర్గానికి గుజరాత్, ద్వారకలో మూలాలున్నాయని మోదీ వ్యాఖ్యానించారు. ‘యాదవులతో నాకు అవినాభావ సంబంధం ఉంది. వారి సహకారంతోనే గుజరాత్‌లో అధికారంలోకి వచ్చాను. శ్రీకృష్ణుని దివ్యక్షేత్రాల్లో అతివిశిష్టమైనది ద్వారక. ఆ దివ్యధామం గుజరాత్‌లోనే ఉండడం మేం చేసుకున్న అదృష్టం’ అని ప్రధాని స్పష్టం చేశారు. జాతిపిత మహాత్మాగాంధీ కూడా గుజరాత్‌కు చెందినవారేనని గుర్తుచేశారు. బీజేపీ అభ్యర్థులు రామ్ కృపాల్ యాదవ్, రవిశంకర్ ప్రసాద్ తరఫున ప్రధాని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పాట్నా సాహిబ్ నుంచి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, పాటలీపుత్ర నుంచి రామ్‌కృపాల్ యాదవ్ పోటీలో ఉన్నారు. ఎన్నికల ర్యాలీలో బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్, ఎల్‌జేపీ అధినేతర రామ్‌విలాస్ పాశ్వాన్ పాల్గొన్నారు. 1984 సిక్కుల మారణహోంపై కాంగ్రెస్ సీనియర్ నేత శ్యాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలను మోదీ తప్పుపట్టారు.