జాతీయ వార్తలు

280 స్థానాలతో కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కారే: యెడ్యూరప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, మే 15: కేంద్రంలో మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటవుతుందని కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప పేర్కొన్నారు. కర్నాటకలోని చించోళీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ప్రచారం నిమిత్తం వచ్చిన యడ్యూరప్ప.. అనంతరం వికారాబాద్ జిల్లా తాండూరుకు విచ్చేసి స్థానికంగా ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో 280 పార్లమెంట్ స్థానాలు గెలుచుకొని మరోసారి నరేంద్రమోదీ ప్రధాని అవుతున్నట్లు యడ్యూరప్ప జోస్యం చెప్పారు. కర్నాటకలో ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం అస్తిత్వం కోల్పోయిందని అన్నారు. కాంగ్రెస్‌కి కేవలం అధికారమే పరమావధి అని విమర్శించారు. కర్నాటకలోని చించోళీ, హోలికేరి నియోజకవర్గాల ఉపఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో అభివృద్ధి, ప్రజా సంక్షేమం కుంటుపడిందని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటు అనంతరం కర్నాటకలో రాజకీయాల రూపు మారుతుందని, ప్రస్తుతం బీజేపీకి 104 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇద్దరు ఇండిపెండెంట్లు మొగ్గు చూపుతున్నట్లు, గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన చించోళీ ఎమ్మెల్యే ఉమేష్ జాదవ్ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరుగుతోందని చెప్పారు. కాంగ్రెస్‌కి చెందిన మరో 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వివరించారు. తాను మళ్లీ సీఎం అవుతానని యడ్యూరప్ప స్పష్టం చేశారు. సమావేశంలో బీజేపీ నాయకుడు బాబూమోహన్, కర్నాటక మాజీ మంత్రి అరవింద నింబావలి, చించోళీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉమేష్ జాదవ్‌తో పాటు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్యాట బాల్‌రెడ్డి, నాగారం నర్సింలు, మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పటేల్ జయశ్రీ, మహిళా మోర్చా కార్యదర్శి లలిత పాల్గొన్నారు.