జాతీయ వార్తలు

రాజీనామా చేయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 29: అన్నాడిఎంకె బహిష్కృత ఎంపీ ఎం శశికళ పుష్ప పార్టీ అధినాయకత్వంపై ధిక్కారస్వరం వినిపించారు. తన రాజ్యసభ సభ్యత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయనని సోమవారం వెల్లడించారు. సింగపూర్ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకున్న శశికళ మీడియాతో మాట్లాడుతూ ‘రాజ్యసభ సభ్వత్వానికి రాజీనామా చేసే ప్రశే్నలేదు’ అని అన్నారు. ఇంట్లో పనివాళ్లను లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఎంపీ, ఆమె కుటుంబ సభ్యులపై అభియోగం. తూతుకుడి పోలీసు స్టేషన్‌లో వారిపై కేసు నమోదైంది. అనేక వివాదాలకు కేంద్ర బిందువైన శశికళను ఈ నెల 22న అన్నాడిఎంకె నుంచి బహిష్కరించారు. అలాగే ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్‌కోసం చేసిన అభ్యర్థనపై సంతకం విషయంలో ఆమె మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.