జాతీయ వార్తలు

పాఠశాలల్లో ప్రార్థనలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఆగస్టు 29: పాఠశాల వార్షికోత్సవాలు, ఫంక్షన్లలో మతపరమైన పాటలు, ప్రార్థనలు, జ్యోతి ప్రజ్వలన వంటి కార్యక్రమాలు మానుకోవాలని కేరళ పబ్లిక్ వర్క్స్ మంత్రి జి సుధాకరన్ అన్నారు. ‘రాజ్యాంగంలో ఎక్కడా కులం లేదా మతం గురించి ప్రస్తావన లేదు. పాఠశాలల్లో జ్యోతి ప్రజ్వలన చేయనక్కర్లేదు. చేయమని రాజ్యంగంలో ఎక్కడా చెప్పలేదు కూడా’ అని మంత్రి స్పష్టం చేశారు. పాఠశాల్లో జరిగే ప్రభుత్వ ఫంక్షన్లలో వీటికి దూరంగా ఉండాలని మంత్రి తెలిపారు. అలప్పుఝా జిల్లాలోని ముతుకులంలో జరిగిన ఓ సెమినార్‌లో మాట్లాడుతూ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫలానా కులం, మతం అంటూ మద్దతు తెలపదని సీనియర్ సిపిఎం నేత పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.